జెలెన్స్కీకి యుద్ధం ముగియడం ఇష్టం లేదు: ట్రంప్ సంచలన ఆరోపణలు!

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య మూడేళ్లకు పైగా కొనసాగుతున్న సైనిక ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా మరోసారి తీవ్రస్థాయిలో స్పందించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఉద్దేశాలను బహిరంగంగా ప్రశ్నించిన డొనాల్డ్ ట్రంప్..ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ యుద్ధాన్ని పొడిగిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. యూరప్ దేశాల నుంచి అందుతున్న భారీ ఆర్థిక సాయంతో పాటు మాజీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో లభించిన మద్దతే జెలెన్స్కీ ఈ విధంగా ప్రవర్తించడానికి ప్రధాన కారణమని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు.

భారత్ కు బిగ్ రిలీఫ్- మాఫీ: విచక్షణాధికారాలను ఉపయోగించిన డొనాల్డ్ ట్రంప్
భారత్ కు బిగ్ రిలీఫ్- మాఫీ: విచక్షణాధికారాలను ఉపయోగించిన డొనాల్డ్ ట్రంప్

రష్యాపై తక్షణమే కొత్త ఆంక్షలు విధించడం లేదా కఠినమైన పత్రాలపై సంతకం చేయడం వంటి చర్యలకు తాను ఎందుకు దూరంగా ఉంటున్నానో డొనాల్డ్ ట్రంప్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య కీలకమైన శాంతి చర్చలతో పాటు బందీల మార్పిడికి సంబంధించి సానుకూల పురోగతి సాధించబడుతోందని ఆయన వెల్లడించారు. ఇలాంటి సున్నితమైన సమయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శాంతి చర్చల నుంచి వైదొలిగే ప్రమాదం ఉందని.. అది దౌత్య ప్రయత్నాలను పూర్తిగా దెబ్బతీస్తుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ సమీకరణాలను సమతుల్యంగా ఉంచడమే తమ ప్రాథమిక లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.

America President Donald Trump Blames Volodymyr Zelenskyy for Prolonging War with Russia Details

ఉక్రెయిన్ సైనిక వ్యూహాలపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. రష్యాలోని డీజిల్ రిఫైనరీలను ఉక్రెయిన్ బలగాలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ దాడుల వల్ల అంతర్జాతీయ డీజిల్ మార్కెట్ దారుణంగా దెబ్బతింటోందని.. దాని వల్ల అమెరికన్ రైతులు, పశుపోషకులు, అనేక రకాల వ్యాపార రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. యుద్ధం జరుగుతున్నప్పటికీ.. రష్యా ప్రపంచ విపణికి చాలా తక్కువ ధరకే లక్షలాది బ్యారెళ్ల డీజిల్‌ను సరఫరా చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేశారు. జెలెన్స్కీకి యుద్ధం ముగించడం కంటే జో బైడెన్, యూరప్ ఇచ్చే నిధులతో పోరాటాన్ని సాగదీయడమే ముఖ్యంగా మారిందని, అందుకే ఆయన ప్రపంచ ఆర్థిక పరిణామాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

మనిషిని చంపిన పులితో ట్రంప్ సరసాలు..
మనిషిని చంపిన పులితో ట్రంప్ సరసాలు..

రెండేళ్ల క్రితమే ఉక్రెయిన్ ఓ మెరుగైన శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే సువర్ణావకాశం పొందిందని.. అయితే జెలెన్స్కీ ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆ నిర్ణయం వల్ల నేడు ఉక్రెయిన్ పూర్తిగా నాశనమైందని.. తమ కీలకమైన భూభాగాలు, సముద్ర తీర ప్రాంతాలపై నియంత్రణను కోల్పోవడమే కాకుండా.. దేశంలోని పురుష జనాభాలో అత్యధికులు ప్రాణాలు కోల్పోవడం లేదా తీవ్రంగా గాయపడటం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరగా ఎంతటి మూల్యం చెల్లించైనా సరే.. ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఈ రక్తపాత ఘర్షణ తక్షణమే ముగియాలని తాను కోరుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+