కాల్పుల్లో గాయపడ్డ టైగర్ ష్రాఫ్ ఫస్ట్ ఫొటో: డిప్యూటీ సీఎం రాక.. !!

బాలీవుడ్ పై మరోసారి మాఫియా పంజా విసిరే ప్రయత్నం చేసింది. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం సాయంత్రం ఓ ఫుట్‌బాల్ క్లబ్ నుంచి ఆయన బయటకు వస్తున్న సమయంలో అయిదు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ వార్త బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

తుపాకీ కాల్పుల వల్ల ఎగిరిపడిన గాజు పెంకులు, గన్‌పౌడర్ శకలాలు గుచ్చుకోవడంతో టైగర్ ష్రాఫ్ చేయి, భుజం, ఛాతీ పైభాగంలో గాయాలయ్యాయి. ఆయన కారు డ్రైవర్‌కు నేరుగా బుల్లెట్లు తగిలింది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. డ్రైవర్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Deputy CM Eknath Shinde meets actor Tiger Shroff at his residence in Mumbai following the gun firing

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. అర్థరాత్రి టైగర్ ష్రాఫ్ నివాసానికి చేరుకున్నారు. ఆయనను పరామర్షించారు. తల్లి అయేషా ష్రాఫ్‌ను కలసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన టైగర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. వ్యక్తిగత భద్రతతో పాటు ఇంటి వద్ద అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ సమయంలో టైగర్ ష్రాఫ్ కుడి చెయ్యి, ఛాతీ భాగంలో బ్యాండేజీతో కనిపించారు. కాల్పుల తర్వాత ఆయన మొట్టమొదటి ఫొటో ఇది.

అలా చేస్తేనే జనం నమ్ముతారు.. : ఎస్ఈసీతో జగన్ ఆకస్మిక భేటీ
అలా చేస్తేనే జనం నమ్ముతారు.. : ఎస్ఈసీతో జగన్ ఆకస్మిక భేటీ

అనంతరం ఏక్‌నాథ్ షిండే మీడియాతో మాట్లాడారు. 1990ల కాలంలో ముంబై నగరంలో గ్యాంగ్ వార్‌లు ఎక్కువగా ఉండేవి అని, 1995 నాటికి ముంబై పోలీసులు వాటిని పూర్తిగా అణచివేశారని ఆయన గుర్తుచేశారు. నగరంలో మళ్లీ అటువంటి భయాందోళనకర వాతావరణాన్ని లేదా రౌడీయిజాన్ని పునరావృతం కానివ్వమని స్పష్టం చేశారు. ఇటువంటి బెదిరింపులను ఏమాత్రం సహించబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని షిండే హెచ్చరించారు.

జగన్ బిగ్ స్టెప్- గవర్నర్ దృష్టికి అన్ని విషయాలు
జగన్ బిగ్ స్టెప్- గవర్నర్ దృష్టికి అన్ని విషయాలు

కాగా.. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ డిప్యూటీ కమిషనర్ మోహిత్ గర్గ్, జుహూ పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొన్ని సాక్ష్యాధారాలు సేకరించారు. ఫుట్‌బాల్ క్లబ్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒకరిని అరెస్ట్ చేశారు.

పులివెందులలో ఆ పార్టీకి కనీసం 15,000 మెజారిటీ: బెట్టింగ్ రాయుళ్ల భారీ అంచనాలు
పులివెందులలో ఆ పార్టీకి కనీసం 15,000 మెజారిటీ: బెట్టింగ్ రాయుళ్ల భారీ అంచనాలు

దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే నటి దిశా పటానీ కూడా టైగర్ ష్రాఫ్ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. ఈ కాల్పుల ఘటన ముంబైలో ప్రముఖుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. పబ్లిక్ ఫిగర్లపై వరుసగా బెదిరింపులు, దాడుల ప్రయత్నాలు పెరుగుతుండటంతో పోలీసులు నగరంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్.. ఇంటిపైనా కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+