మనిషిని చంపిన పులితో ట్రంప్ సరసాలు..
బ్రిటన్‌లోని ఓ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. బ్రిటన్‌కు చెందిన 23 ఏళ్ల విలియం చాప్మన్ అనే యువకుడు పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లడంతో పులి దాడి చేసి ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన ఫుటేజీని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేస్తూ.. "ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రకృతితో చెలగాటం ఆడకండి! - ప్రెసిడెంట్ DJT" అంటూ క్యాప్షన్ జోడించారు.
పులితో ట్రంప్ హగ్, నవ్వులు!
నిజానికి పులి దాడి చేసిన భయానక ఘటన వీడియోను షేర్ చేయడమే కాకుండా, ట్రంప్ మరో అడుగు ముందుకేసి ఒక విచిత్రమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వీడియోను కూడా పోస్ట్ చేశారు. 23 సెకన్ల పాటు ఉన్న ఆ ఏఐ వీడియోలో ట్రంప్ స్వయంగా పులితో ఆడుకుంటున్నట్లు, దానితో కుస్తీ పడుతున్నట్లు, ఆ తర్వాత ఆ పులితో స్నేహం చేస్తున్నట్లు సృష్టించారు. వీడియో చివర్లో ట్రంప్ ఆ పులిని హత్తుకుని నవ్వుతున్నట్లు ఉండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో "ది లయన్ స్లీప్స్ టునైట్" అనే పాట ప్లే అవుతున్నట్లు చూపించారు. అంతేకాకుండా, అడవి జంతువులు మనుషులపై దాడి చేస్తున్న మరికొన్ని మోంటేజ్ వీడియోలను కూడా ఆయన షేర్ చేశారు.
New media post from Donald J. Trump( TS: Oct 13 2026, 11:17 PM ET ) https://t.co/lkyx2bHihJ
— Commentary Donald J. Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) October 14, 2026

కన్నీరు మున్నీరు అవుతున్న మృతుడి కుటుంబం..
ఒకవైపు కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న విలియం చాప్మన్ కుటుంబ సభ్యులు, ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూట్ అవుతుండటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధాకరమైన సమయంలో ఇలాంటి సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు తమను మరింత క్షోభకు గురిచేస్తున్నాయని, వీటిని షేర్ చేయడం వెంటనే ఆపేయాలని వారు కన్నీళ్లతో అభ్యర్థించారు. బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం.. చాప్మన్ కుటుంబం ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఈ అభ్యంతరకర కంటెంట్ తమకు తీవ్ర మానసిక క్షోభను కలిగిస్తోందని వాపోయింది.
మానసిక అనారోగ్యంతో బాధపడిన యువకుడు.. ప్రాణాలు తీసిన అరుదైన పులి
మృతి చెందిన విలియం చాప్మన్ చాలా కాలంగా తీవ్రమైన మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, అతనొక మంచి, చురుకైన యువకుడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, అతని మరణానికి ఆ వైద్య చరిత్రేమైనా కారణమా లేదా అనేది కరోనర్ విచారణలో తేలుతుందని పేర్కొన్నారు. మరోవైపు, ఈ దాడికి కారణమైన 'అల్టాయ్' (Altai) అనే అంతరించిపోతున్న అరుదైన అముర్ పులికి ఎలాంటి మరణశిక్ష అమలు చేయడం లేదని వైల్డ్‌లైఫ్ పార్క్ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక అధికారులు ఆరోగ్య, భద్రతాపరమైన దర్యాప్తు జరుపుతుండగా.. ఆ వైల్డ్‌లైఫ్ పార్క్‌ను తాత్కాలికంగా మూసివేశారు.














Click it and Unblock the Notifications
