టైగర్ ష్రాఫ్ పై కాల్పులు జరిగిన లైవ్ వీడియో.. రైల్వే స్టేషన్ లో దొరికిన బైక్

బాలీవుడ్ పై మరోసారి మాఫియా పంజా విసిరే ప్రయత్నం చేసింది. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం సాయంత్రం ఓ ఫుట్‌బాల్ క్లబ్ నుంచి ఆయన బయటకు వస్తున్న సమయంలో అయిదు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ వార్త బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

తుపాకీ కాల్పుల వల్ల ఎగిరిపడిన గాజు పెంకులు, గన్‌పౌడర్ శకలాలు గుచ్చుకోవడంతో టైగర్ ష్రాఫ్ చేయి, భుజం, ఛాతీ పైభాగంలో గాయాలయ్యాయి. ఆయన కారు డ్రైవర్‌ ఫిర్దౌస్ కు నేరుగా బుల్లెట్లు తగిలింది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. డ్రైవర్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

First image of accused shooters in the firing incident involving Tiger Shroff have surfaced video

టైగర్ ష్రాఫ్ వాహనంపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరుపుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఫుట్ బాల్ క్లబ్ నుంచి తన కారులో టైగర్ ష్రాఫ్ బయటికి వస్తోన్న సమయంలో అక్కడున్న వాళ్లు మొబైల్ ఫోన్ లో వీడియో చిత్రీకరిస్తోండగా ఇది రికార్డయింది. ఎంహెచ్ 2 జీఈ 0264 లగ్జూరియస్ ఆడి కారులో గేటు దాటి బయటికి వచ్చిన వెంటనే తెల్లటి షర్టులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బుల్లెట్ల వర్షాన్ని కురిపించడం ఈ వీడియోలో చూడొచ్చు.

First image of accused shooters in the firing incident involving Tiger Shroff have surfaced video

కారు ఎదురుగా నిల్చొని ఒకడు.. ఎడమ వైపు నిల్చొని మరొకడు దాదాపుగా పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి అయిదు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఆ వెంటనే బైక్ పై పారిపోయారు. ఇదంతా ఆ వీడియోలో రికార్డయింది. వారిలో ఒకడు ప్యూమా లోగో ఉన్న బ్లాక్ క్యాప్ ధరించాడు. మూడో వ్యక్తి బైక్ పై కనిపించాడు. కాల్పులు జరిపిన ఇద్దర్నీ బైక్ పై ఎక్కించుకుని పారిపోయాడు. ఈ వీడియోను ఇన్ సైడ్ పేపర్ అనే ట్విట్టర్ యూజర్ దీన్ని పోస్ట్ చేశాడు.

ఆ తర్వాత ఈ దాడికి పాల్పడిన నిందితుల ఫొటోలను కూడా ముంబై పోలీసులు విడుదల చేశారు. సీసీటీవీలో వీడియోల్లో రికార్డయిన ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా షూటర్ల మూవ్‌మెంట్స్‌ను గుర్తించడానికి ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

కాల్పుల్లో గాయపడ్డ టైగర్ ష్రాఫ్ ఫస్ట్ ఫొటో: డిప్యూటీ సీఎం రాక.. !!
కాల్పుల్లో గాయపడ్డ టైగర్ ష్రాఫ్ ఫస్ట్ ఫొటో: డిప్యూటీ సీఎం రాక.. !!

నిందితులు వాడిన బైక్.. అంధేరి రైల్వే స్టేషన్ పరిసరాల్లో వదిలేసి వెళ్లినట్లు తేలింది. పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని రిజిస్ట్రేషన్, ఇంజిన్, ఛాసిస్ నంబర్లను పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా బైక్ ద్వారా ఎవరిదనేది తెలుసుకుంటోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+