9/11 ట్విన్ టవర్స్: అదే అమెరికన్ల భయం (వీడియో)
వాషింగ్టన్: ఉగ్రవాదులు దాడులు చేస్తారని అమెరికా ప్రజలు భయపడిపోతున్నారని, అదే రిపబ్లికన్ పార్టీ నాయకుడు డోనాల్డ్ ట్రంప్ కు కనపడుతున్నదని న్యాయార్క్ టైమ్స్-సీబీఎస్ న్యూస్ సర్వే వెల్లడించింది.
2001 సెప్టెంబర్ 11 దాడుల తరువాత ఉగ్రవాదులు అమెరికా మీద దాడులు చేసే అవకాశం ఉందని అమెరికన్లు భయపడుతున్నారని ఆ సర్వే తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ తరుపు అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడానికి పోటీపడుతున్న ట్రంప్ ఇదే విషయం చెబుతున్నారని సర్వే అంటున్నది.
ఉగ్రవాదులు దాడులు చేస్తారంటూ భయపడుతున్న అమెరికన్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందని ఆ సర్వే అంటున్నది. పారిస్, కాలిఫోర్నియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు దాడులు చేసిన తరువాత అమెరికన్లలో పెద్ద మార్పు వచ్చింది.
ఇదే సందర్బంలో ఎన్నికల్లో పోటి చేస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లీంలు తాత్కాలికంగా అమెరికా రాకుండా నిషేధించాలని ట్రంప్ డిమాండ్ చేశారు.
ట్రంప్ ఈ వ్యాఖ్యలు చెయ్యకముందు నాలుగు శాతం మంది అమెరికన్లు ఉగ్రవాదులు దాడులు చేస్తారని ఆందోనళ చెందారు. ఇప్పుడు ఉగ్రదాడి జరుగుతుందని భయపడుతున్న వారి సంఖ్య 19 శాతానికి పెరిగిందని ఆ సర్వే తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications