కలలో వచ్చిందే నిజమైంది.. ఏకంగా రూ. 2 కోట్లు గెలిచేలా చేసింది..
చాలా మంది నిద్రలో కలలు కంటారు. అందులో మంచి కలలతో పాటు చెడు కలలు కూడా ఉంటాయి. అయితే మంచి కలలు వచ్చినప్పుడు.. అవి నిజమవ్వాలని కోరుకుంటారు. అయితే అవి నిజమవుతాయా అంటే కష్టమే.. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే నిద్రలో వచ్చిన కలలు నిజమవుతాయి. ఇలా ఓ వ్యక్తి కల నిజమైంది. తన కలలో ఓ నెంబర్ తో లాటరీ కొన్నట్లు.. ఆ నెంబర్ తో లాటరీ తగినట్లు వచ్చింది. అయితే ఆ కల నిజమైంది. రెండు డాలర్లు అంటే భారతీయ కరెన్సీ రూ.157 పెట్టి టికెట్ కొంటే రెండు కోట్ల లాటరీ గెలుచుకున్నాడు.
యూఎస్ లోని వర్జీనియాలో హెన్రికో కౌంటీకి చెందిన అలోంజో కోల్‌మాన్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. అయితే అతనికి ఓ రోజు 13-14-15-16-17-18-19 నంబర్ల తో లాటరీ కొంటే, అది గెలిచినట్టు కల వచ్చింది. అతను నిజంగానే 13-14-15-16-17-18 నెంబర్ల గల లాటరీని రెండు డాలర్లు పెట్టి కొన్నాడు. ఆ తర్వాత తను దాన్ని పట్టించుకోలేదు. అయితే ఎవరో అతనికి జూన్ 11న లాటరీ డ్రా తీస్తున్నారని చెప్పారు. అతను వెళ్లి చూసే సారికి స్క్రీన్ మీద అతని లాటరీ నంబర్ 13-14-15-16-17-18, రెండున్నర లక్షల డాలర్లు గెలుపొందినట్టుగా ఉండటంతో ఆశ్చర్యపోయాడు. అలోంజో కోల్‌మాన్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.

రెండున్నర లక్షల డాలర్లు అంటే ఇండియాన్ కరెన్సీలో దాదాపు రెండు కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అయితే తన కలలో వచ్చిన నంబర్లతోనే లాటరీ కొన్నానని అలోంజో కోల్‌మాన్ తెలిపారు. ఆ లాటరీలో డబ్బులు గెలవడం నిజంగా నమ్మలేకున్నానని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.












Click it and Unblock the Notifications