వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢాకా పుస్తక ప్రదర్శనకు వెళ్లిన అమెరికన్ రచయిత రాయ్ హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

ఢాకా: పుస్తక ప్రదర్శనకు వెళ్లిన అమెరికన్-బాంగ్ల రచయిత, బ్లాగర్ ను అతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమెరికాకు చెందిన డాక్టర్ అవిజీట్ రాయ్ (40) అనే రచయిత ఉగ్రవాదుల చేతిలో అంతం అయ్యాడు. ఈయన భర్యా ప్రాణాలతో బయటపడ్డాడు. రాయ్ బాగ్లాందేశ్‌లో పుట్టిపెరిగాడు. ప్రస్తుతం రాయ్ కుటుంబ సభ్యులు అమెరికాలో స్థిరపడ్డారు.

రాయ్ రచించిన అనేక రచనలు అమెరికాలో పేరుపోందాయి. ఈయన రచనలను ఇస్లామిక్ తీవ్రవాదులు వ్యతిరేకించే వారు. గురువారం బాంగ్లాదేశ్ లోని ఢాఖలో జరిగిన పుస్తక ప్రదర్శనకు రాయ్ అతని భార్యతో కలిసి వెళ్లారు. తరువాత అక్కడి నుండి వేరే ప్రాంతానికి ఆటోలో వెలుతున్న సమయంలో ఉగ్రవాదులు నడి రోడ్డు మీద ఆటో అడ్డగించారు. రాయ్ మీద తుపాకితో కాల్చి కత్తులతో దాడి చేసి అక్కడి నుండి పరారైనారు. తీవ్రగాయాలైన రాయ్ ని ఆసుపత్రికి తరలిచంగా మరణించాడు.

American Writer Rai Murderd In Dhaka

రాయ్ ఇస్లాంకు వ్యతిరేకంగా కొన్ని రచనలు రచించాడని సమాచారం. రాయ్ కి ఉగ్రవాదులు అనేక సార్లు బెదిరింపు ఫోన్ చేసి చంపేస్తామని హెచ్చరించారని అతని భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని రాయ్ భర్యకు చూపించారు.

అయితే ఆమె షాక్ లో ఉండటం వలన హంతకులును సరిగా గుర్తు పట్టడం లేదని పోలీసులు అంటున్నారు. రాయ్ ని హత్య చేసిన వారిని అరెస్టు చరేసి శిక్షించాలని ఢాఖలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.

English summary
Bangla - american writer Rai murdered in Dhaka of Bangladesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X