వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ తిక్క సలహా - గూగుల్ లో వాటి కోసం తెగ వెతికేస్తున్న అమెరికన్లు..

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ అమెరికన్ల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ కరోనాను లైట్ తీసుకోవడంతో మొదలైన ఉత్పాతం ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇప్పుడు వేలాది మంది అమెరికన్ల ప్రాణాల్ని హరిస్తోంది. దీంతో ట్రంప్ కు సెగ తగులుతోంది. తొలుత ఇందుకు కారణాలను వెతికిన ట్రంప్ తాజాగా వైరస్ నియంత్రణకు సలహాలు కూడా ఇస్తున్నారు. వీటిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

కరోనా వైరస్ ను రోగి శరీరం నుంచే బయటికి పంపేయాలంటే అతినీలలోహిత కిరణాలతో పాటు క్రిమి సంహారకాలను చొప్పిస్తే చాలన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ సలహా తర్వాత అమెరికన్లు క్రిమి సంహారకాల గురించి గూగుల్ లో వెతకడం మొదలుపెట్టారు. అద్యక్షుడు ట్రంప్ చెప్పిన క్రిమిసంహారకాలు ఎందులో ఉంటాయో కూడా తెలియక వారు వ్యాక్సిన్ల నుంచి విటమిన్ల వరకూ అన్నీ వెతికేస్తున్నారు.

americans googling from vaccines to vitamines after trump disinfectant cure

గతంలో బహుళజాతి సంస్ధలు తయారు చేస్తున్న కూల్ డ్రింక్స్ లో క్రిమి సంహారకాలు ఉన్నాయని పలు పరిశోధనలు నిరూపించాయి. కానీ ఇప్పుడు క్రిమిసంహారకాలు ఉన్న ఇతరత్రా ఆహారపదార్ధాలు, వ్యాక్సిన్లు, విటమిన్ల కోసం అమెరికన్లు గూగుల్ లో వెతకడం చూస్తుంటే జనం నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ట్రంప్ ఏదో ఫ్రస్ట్రేషన్ లో సలహా ఇచ్చారనుకున్నా దాన్ని పట్టుకుని క్రిమిసంహారకాల కోసం అమెరికన్లు వెతకడం ఏంటని జనం ఆశ్చర్యపోతున్నారు.

English summary
after amercian president donald trump's disinfectant advice for coronavirus treament, now americans are googling for the same. mainly they have been searching from vaccines to vitamins also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X