వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు వ్యతిరేకంగానా?: నేపాల్ ప్రధాని కేపీ శర్మ రాజీనామాకు డిమాండ్, చైనా షాక్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వరుసగా భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలిపై రోజురోజుకు అసమ్మతి పెరుగుతోంది. సొంత పార్టీ నేతలు ఆయన రాజీనామాకు డిమాండ్ చేయడం గమనార్హం. అంతేగాక, పార్టీని రెండుగా చీలుస్తామని హెచ్చరించారు.

కేపీ శర్మ ఓలి రాజీనామాకు డిమాండ్.. హెచ్చరిక

కేపీ శర్మ ఓలి రాజీనామాకు డిమాండ్.. హెచ్చరిక


కేపీ శర్మ ఓలి అన్ని విధాలుగా విఫలమయ్యారని మాజీ ప్రధాని, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు ప్రచండ అన్నారు. ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేయాల్సిందేనని ప్రచండ డిమాండ్ చేశారు. అంతర్గత కలహాలు చెలరేగుతున్నా రాజీనామా చేసేందుకు ఓలి అంగీకరించకపోవడంతో పార్టీని రెండు చీలుస్తామంటూ హెచ్చరించారు.

ప్రచండకు అసమ్మతి నేతల మద్దతు..

ప్రచండకు అసమ్మతి నేతల మద్దతు..

కేపీ శర్మ ఓలితో కలవడమే తాను రాజకీయ నాయకుడిగా తాను చేసిన అతి పెద్ద తప్పు అని ప్రచండ వ్యాఖ్యానించారు. కాగా, పార్టీలో ఓలి అసమ్మతి నేతలంతా ప్రచండకు మద్దతు పలుకుతుండటం గమనార్హం. కాగా, నేపాల్ ప్రధాని కేపీ ఓలికి చైనాతో సత్ససంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆయన భారత్ కు వ్యతిరేకంగా.. చైనాకు మద్దతుగా వ్యవహరించారు.

చైనాను చూసుకుని ఓలి దుస్సాహసం..

చైనాను చూసుకుని ఓలి దుస్సాహసం..

తాజాగా, భారత భూభాగాలైన లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలను తమవిగా చూపుతూ సవరించిన చిత్రపటాన్ని నేపాల్ పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. కేపీ శర్మ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా సొంత పార్టీ నేతలు వ్యతిరేకించాయి. తమ భూభాగాలను తమవిగా నేపాల్ చూపడంపై భారత్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలు ఎప్పటికీ భారత అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఒకవేళ భారత్‌తో యుద్ధం వస్తే తాము చేయమని నేపాల్ సైనిక దళాలు కూడా ప్రకటించడం గమనార్హం.

Recommended Video

India-Nepal Relations మీద Rajnath Singh కామెంట్లు,భారత భూ భాగాలతో ఉన్నNepal Map ను ఒప్పుకున్నట్టేనా?
యోగి చెప్పినట్లే.. నేపాల్ సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకుంటున్న చైనా..

యోగి చెప్పినట్లే.. నేపాల్ సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకుంటున్న చైనా..

నేపాల్ తీరుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్రంగా స్పందించారు. రాబోయే కాలంలో నేపాల్ కూడా మరో టిబెట్ అయ్యే అవకాశం లేకపోలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. గతంలో స్వతంత్ర దేశంగా ఉన్న టిబెట్‌ను చైనా దురాక్రమణ చేసిన విషయం తెలిసిందే. యోగి వ్యాఖ్యలపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మండిపడ్డారు. తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. అయితే, ఇటీవల నేపాల్ దేశంలోని పలు సరిహద్దు ప్రాంతాలను చైనా ఆక్రమించిందని స్వయంగా ఆ దేశ మంత్రే ప్రకటించడం గమనార్హం. చైనాకు మద్దతుగానే ఉంటున్నప్పటికీ నేపాల్ ప్రాంతాలనూ డ్రాగన్ వదలకపోవడం చర్చనీయాంశంగా మారింది.

English summary
Amid the ongoing border dispute with India, many in the ruling party of Nepal Communist Party have raised demands seeking Prime Minister KP Sharma Oli’s resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X