• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్-చైనా యుద్ధతంత్రం: ట్రంప్ బాంబు.. మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న అమెరికా.. అనూహ్య మలుపు..

|

భారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి యుద్ధ వాతావరణం నెలకొన్నవేళ.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందని, ఇప్పటికే తమ ప్రతిపాదనను భారత్, చైనాకు తెలియజేశానని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

  #IndiaChinaFaceOff : Donald Trump Ready To Mediate Between India - China Dispute

  భారత్‌పై చైనా భారీ యుద్ధతంత్రం.. ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. క్షణక్షణం ఉత్కంఠ..

  అసలేం జరుగుతోందంటే..

  అసలేం జరుగుతోందంటే..

  తూర్పు లదాక్ లోని దర్బూక్-షోయక్-దౌలత్ బేగ్ ఓల్డీ (డీబీఓ) మధ్య 255 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మాణం భారత్ గతేడాది పూర్తిచేసింది. దీనికి అనుసంధానం చేస్తూ అదనపు రహదారులు, వంతెనల నిర్మాణం ప్రారంభించింది. రోడ్డు నిర్మాణాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తోన్న చైనా.. కరోనా రాజకీయాలు మారిపోయిన దశలో.. గడిచిన 20 రోజులుగా భారతను నిలువరించేందుకు బలంగా ప్రయత్నిస్తున్నది. పలుమార్లు భారత సైన్యంతో నేరుగా తలపడింది. అంతటితో ఆగకుండా యుద్ధసన్నద్ధతను ప్రకటించింది. భారత్ మాత్రం ‘స్టేటస్ కో'కు పట్టుపడుతూనే, ఎదురుదాడికి సిద్ధమవుతోంది. ఈ టెన్షన్ నడుమ ట్రంప్ మధ్యవర్తిత్వం బాంబు పేల్చడంతో వ్యవహారం అనూహ్య మలుపు తిరిగినట్లయింది.

  ట్రంప్ ఏమన్నారంటే..

  ట్రంప్ ఏమన్నారంటే..

  ‘‘భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం పెద్దదవుతున్నట్లు తెలిసింది. సమస్యను సామర్యంగా పరిష్కరించుకోవడంలో భాగంగా మధ్యవర్తిత్వం చేసేందుకు అమెరికా రెడీగా ఉంది. ఈ విషయాన్ని రెండు దేశాలకు తెలిజచేశాం. ధన్యవాదాలు'' అని ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్ ప్రకటనపై ఇటు భారత్ గానీ, అటు చైనాగానీ స్పందించాల్సి ఉంది. గతంలో కాశ్మీర్ వివాదంలోనూ ట్రంప్.. తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకురాగా.. భారత్ సున్నితంగా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

  అమెరికా ఎత్తుగడ ఇదే..

  అమెరికా ఎత్తుగడ ఇదే..

  ఇండో-చైనా బోర్డర్ వివాదంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తరచూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. స్వయంగా ప్రెసిడెంటే మధ్యవర్తిత్వం వహిస్తాననడం బహరంగంగా చెప్పడం ఇదే తొలిసారి. వారం రోజుల కిందటే.. ఇండో-చైనా వివాదంపై అమెరికా విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి, సౌత్, సెంట్రల్ ఏషియా వ్యవహారాల బ్యూరో చీఫ్ ఆలిస్ వేల్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా దూకుడుకు కళ్లెం వేయడానికే.. ఆసియాలో సారూప్య భావజాలం కలిగిన దేశాలతో అమెరికా కలిసి నడుస్తున్నదని, అమెరికా, జపాన్, ఇండియాతో కూడిన త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేశామని, ఇదే క్రమంలో మరిన్ని కూటములూ ఏర్పాటు చేస్తామని ఆలిస్ తెలిపారు. కూటమిలోని దేశాలతో తగువులు పెట్టుకోకుండా చైనాను నిలువరించేందుకు గట్టిగా ప్రయత్నిస్తామన్నారు.

  భారత్-చైనా ఒప్పుకుంటాయా?

  భారత్-చైనా ఒప్పుకుంటాయా?

  సరిహద్దు గొడవలో అమెరికా జోక్యంపై భారత్-చైనా ప్రస్తుతం ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికంగా మారింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి లదాక్ వరకు మొత్తం 3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నప్పటికీ.. భారత్-చైనాల మధ్య 1962 యుద్ధం తర్వాత ఒక్క తుపాకి తూటా కూడా పేలలేదు. అంటే, పాకిస్తాన్ సరిహద్దులోని పరిస్థితికి, చైనా బోర్డర్ కు చాలా తేడాఉంటుంది. పైగా, చైనాతో భారత్ ఆర్థిక సంబంధాలు కూడా పెద్దవే. వీటన్నింటి నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం రాత్రి జరిగిన హైలెవల్ మీటింగ్ లో కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. సాధ్యమైనంత వరకు లదాక్ లో స్టేటస్ కో కొనసాగేందుకు ప్రయత్నించాలని, అంతమాత్రాన డ్రాగన్ దేశానికి తలొగ్గేదిలేదని, దాని తిక్కను అణిచేయాల్సిందేనని మోదీ సైన్యాధికారులతో అన్నట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి భారత్.. ట్రంప్ అభ్యర్థనను అంగీకరించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ఎలాగూ ట్రంప్ మాటను వినేపరిస్థితిలో లేదు.

  యుద్ధవాతావరణం..

  యుద్ధవాతావరణం..

  ప్రస్తుతం భారత్-చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న తూర్పు లదాక్ ప్రాంతానికి కేవలం 200 కిలోమీటర్ల దూరంలో చైనా భారీ ఎయిర్ బేస్ ను సిద్ధం చేయడం, ఈ నెల 20 నాటికే ఆ ప్రాంతంలో అత్యాధునిక చైనీస్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు చేరుకోవడం, పాంగాంగ్ సరస్సుకు సమీపంలోని గాల్వాన్ లోయలో వందకుపైగా తాత్కాలిక గుడారాలను నిర్మించడం లాంటి చర్యలు చైనా యుద్ధ సన్నద్ధతను తెలియజేసేలా ఉన్నాయి. ఉద్రిక్తతలను మరింత పెంచుతూ బుధవారం బీజింగ్ నుంచి ‘‘దేనికైనా సిద్ధంగా ఉండండి..''అంటూ చైనా సైన్యానికి పిలుపురావడం పరిస్థితిని మరింత దిగజార్చింది. చైనాకు ధీటుగా భారత్ సైతం అంతే సంఖ్యలో సైన్యాలను సరిహద్దుకు తరలించింది. అయితే యుద్ధవిమానాలు, ఇతర వాహనాల తరలింపుపై స్పష్టత రాలేదు.

  English summary
  US President Donald Trump on Wednesday waded into the tense border standoff between India and China, saying he was “ready, willing and able to mediate” between the two sides
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more