ఇరాన్ చెరలో 16 మంది భారతీయులు.. తండేల్ సినిమా సీన్ రీపిట్
ఇప్పటికే మధ్యప్రాచ్యాన్ని కుదిపేస్తున్న యుద్ధ వాతావరణం, ఇరాన్ చుట్టూ పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ 16 మంది భారతీయ నావికులు అక్కడ చిక్కుకుపోవడం తీవ్ర ఆందోళనకు కారణమైంది. హార్ముజ్ సముద్ర మార్గం సమీపంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న వేళ… భారతీయుల భద్రతపై భయాలు మరింత బలపడుతున్నాయి.
గత ఏడాది డిసెంబర్ 8న యూఏఈలోని దిబ్బా పోర్టు సమీపంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న వాలియంట్ రోర్ అనే నౌకను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వెంబడించి అదుపులోకి తీసుకున్నాయి. నౌకలో 6 వేల మెట్రిక్ టన్నుల ఇంధనం అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలతో సిబ్బందిని నిర్బంధించారు. ఆ సమయంలో నౌకలో మొత్తం 18 మంది నావికులు ఉండగా, అందులో 16 మంది భారతీయులే కావడం తీవ్ర కలవరం రేపింది.

పది మందిని ఇరాన్‌లోని జైలు
తాజా సమాచారం ప్రకారం, ఈ 16 మంది భారతీయుల్లో పది మందిని ఇరాన్‌లోని జైలుకు తరలించగా, మిగతా వారు ఇప్పటికీ భద్రతా బలగాల నిఘాలో నౌకలోనే ఉన్నారు. వారిపై ఎలాంటి స్పష్టమైన అభియోగాలు నమోదు చేశారన్న విషయంపై అధికారిక సమాచారం బయటకు రాకపోవడంతో కుటుంబాల్లో భయం, అనిశ్చితి పెరుగుతోంది.
ఉద్యోగం కోసం మాత్రమే సముద్రంలో
ఈ ఘటనకు సంబంధించి నౌక కెప్టెన్ నుంచి కుటుంబాలకు అత్యవసర సందేశాలు అందాయి. వాటిని చూసి కుటుంబీకులు ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు. ఇంజినీర్ ఖేతన్ మెహతా తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ, “మా పిల్లలు ఉద్యోగం కోసం మాత్రమే సముద్రంలో ఉన్నారు. ప్రస్తుతం ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణంలో వారికి ఏం జరుగుతుందోనన్న భయం మమ్మల్ని వెంటాడుతోంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు..
నావికులకు తక్షణమే వైద్య, న్యాయ, ఆర్థిక సహాయం అందించాలని, వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ బాధిత కుటుంబీకులు దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, ఈ వ్యవహారంపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.
నావికుల భద్రతపై ఆందోళన..
మధ్యప్రాచ్యంలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు, ఇరాన్‌పై పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో భారతీయ నావికుల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. గతంలో పలు సంక్షోభాల్లో భారత పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం… ఈసారి కూడా వేగంగా స్పందించి, ఇరాన్‌తో దౌత్య చర్చల ద్వారా భారతీయులను కాపాడాలని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇరాన్ లో అల్లర్ల కారణంగా భారతీయుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన మన వారిని తరలించడానికి కేంద్రం అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. తరలింపుదారుల మొదటి బ్యాచ్‌ను నేడు ముందుగానే విమానంలో పంపించేందుకు కేంద్రం ప్లాన్ చేసింది. దేశం విడిచి వెళ్లాలనుకునే వారిని అంచనా వేయడానికి టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం వివిధ ప్రాంతాలలోని భారతీయ విద్యార్థులను సంప్రదించడం ప్రారంభించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం, ఫోన్ లైన్లు అరకొరగా పనిచేస్తున్నందున ఈ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
-
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
Iran War: ట్రంప్ సీజ్ ఫైర్ ప్లాన్ పై తేల్చేసిన ఇరాన్- కీలక ప్రకటన..! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ఇరాన్ క్షిపణి దాడిలో బూడిదైన 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'.. వీడియో వైరల్ -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications