China earthquake: వణికిన డ్రాగన్ కంట్రీ: 69 వేలమందిని బలిగొన్న ఆ ప్రావిన్స్‌లోనే మళ్లీ

బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చైనాలో భారీ భూకంపం సంభవించింది. దేశ ఆగ్నేయ ప్రాంతంలో సంభవించిన భూప్రకంపనల తీవ్రత అనూహ్యంగా ఉంటోంది. భూకంప తీవ్రతకు పలు భవనాలు కంపించాయి. ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రతకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు. రోడ్ల మీదే జాగారం చేశారు.

ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. ఫలితంగా- తమ ఇళ్లల్లోకి వెళ్లడానికి ప్రజలు భయపడ్డారు. రోడ్ల మీదే నిద్రలేని రాత్రిని గడిపారు. చైనా ఆగ్నేయ ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.0గా రికార్డయింది. ఈ ప్రావిన్స్‌లోని ఫ్యూజీ టౌన్‌షిప్ సమీపంలోని కవోబాలో భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ గ్రామంలోనే ఇద్దరు మరణించారు.

An earthquake of magnitude 6 jolted Luxian County of southwest Chinas Sichuan province

గురువారం తెల్లవారు జామున 4:33 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ గ్జిన్‌హువా తెలిపింది. ఫ్యూజీ సమీప ప్రాంతాన్ని చైనా ఎర్త్‌క్వెక్ నెట్‌వర్క్స్ సెంటర్ భూకంప కేంద్రంగా గుర్తించింది. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో మార్పుల వల్ల భూకంపం చోటు చేసుకున్నట్లు తెలిపింది. భూప్రకంపనలు సంభవించిన వెంటనే స్థానిక అధికారులు సిన్‌చువాన్ ప్రావిన్స్‌కు లెవెల్-2 రెస్పాన్స్‌ను జారీ చేశారు.

లెవెట్-2 రెస్పాన్స్‌ను రెండో అతి తీవ్ర ప్రమాదకరమైన హెచ్చరికగా భావిస్తారు. ఈ హెచ్చరికలు జారీ అయిన వెంటనే స్థానిక డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్టిగేషన్ అండ్ రెస్క్కూ విభాగం అధికారులు ల్యూఝౌ సిటీని అప్రమత్తం చేశారు. లెవెల్-1 ఎమర్జెన్సీ రెస్పాన్స్ జారీ చేశారు. తాజా భూకంపం వల్ల ఇద్దరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.

2008లో ఇదే సిన్‌చువాన్ ప్రావిన్స్‌లో పెను భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అప్పట్లో దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.0గా రికార్డయింది. ఆ భూకంపంలో వేలాదిమంది మరణించారు. 69 వేల మందికి పైగా నాటి భూకంపానికి బలి అయ్యారు. 3,74,176 మంది గాయపడ్డారు. 18,222 మంది అదృశ్యం అయ్యారు. వారంతా భూకంపం వల్ల కుప్పకూలిన భవన శిథిలాల మధ్య చిక్కుకుని మరణించినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+