వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో లెప్టినెంట్ గవర్నర్‌‌గా కాట్రగడ్డ అరుణ ఘన విజయం - కృష్ణా జిల్లా కుగ్రామం నుంచి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఈ ఎన్నికలు అమెరికన్ కాంగ్రెస్‌కు సంబంధించినవి. ప్రతి రెండేళ్లకోసారి వీటిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమెరికా అధ్యక్షుడి నాలుగేళ్ల పదవీ కాలం మధ్యలో అంటే ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల్లో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పదవీ కాలం రెండేళ్లు పూర్తయినందున ఈ ఎన్నికలను నిర్వహించారు.

ఈ మధ్యంతర ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. అత్యంత కీలకం, రిపబ్లికన్లకు గట్టిపట్టు ఉన్న మేరీల్యాండ్‌లో డెమొక్రటిక్ పార్టీ పాగా వేసింది. మేరీల్యాండ్ గవర్నర్‌గా డెమొక్రటిక్ పార్టీకి చెందిన వెస్ మూర్ ఎన్నికయ్యారు. మేరీల్యాండ్ నుంచి ఈ అత్యున్నత పదవికి ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు ఆయనే. తన సమీప ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డాన్ కాక్స్‌ను 2-1 తేడాతో ఓడించారు. వెస్ మూర్.. ఆఫ్రికా నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన వ్యక్తి.

 An Indian-American woman Aruna Miller to become the first Lieutenant Governor in Maryland

అదే సమయంలో మేరీల్యాండ్ లెప్టినెంట్ గవర్నర్‌గా భారత సంతతికి చెందిన కాట్రగడ్డ అరుణ మిల్లర్ ఘన విజయం సాధించారు. కృష్ణాజిల్లాలోని వెంట్రప్రగడ ఆమె స్వస్థలం. ఇక్కడే జన్మించారు. 1972లో ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లింది. తండ్రి కాట్రగడ్డ వెంకట రామారావు ఇదివరకు ఐబీఎంలో పనిచేశారు. అరుణ మిల్లర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ స్పెషలిస్ట్. మిస్సౌరీ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్‌ చదివారు.

 An Indian-American woman Aruna Miller to become the first Lieutenant Governor in Maryland

1990లో మోంట్‌గోమెరీ కౌంటీకి షిఫ్ట్ అయ్యారు. తన స్నేహితుడు డేవిడ్ మిల్లర్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు. భారత్ నుంచి వలస వెళ్లిన కుటుంబానికి చెందిన నాయకురాలే. మేరీల్యాండ్ గవర్నర్‌, లెప్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన వెస్ మూర్, అరుణ మిల్లర్.. ఇద్దరూ వలసదారుల కుటుంబానికి చెందిన వారే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఇద్దరి విజయంతో మేరీల్యాండ్‌పై డెమొక్రాట్స్ పట్టు సాధించినట్టయింది.

 An Indian-American woman Aruna Miller to become the first Lieutenant Governor in Maryland
English summary
Aruna Miller, an Indian-American woman, to become the first immigrant to hold the office of Lieutenant Governor in Maryland.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X