వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు నీతులు చెప్పొద్దు: అమెరికా మీడియా, తప్పట్లేదని ట్రంప్

చదివే వారికి వార్తలు ఎలా అందించాలో తమకు తెలుసునని, మాకు మీరు నీతులు చెప్పక్కర్లేదని అమెరికా ప్రెస్ కార్న్స్.. తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు చెప్పింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: చదివే వారికి వార్తలు ఎలా అందించాలో తమకు తెలుసునని, మాకు మీరు నీతులు చెప్పక్కర్లేదని అమెరికా ప్రెస్ కార్న్స్.. తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు చెప్పింది. అమెరికన్లకు వాస్తవాలు అందించడం తమకు తెలుసునని చెప్పింది.

ఈ మేరకు ఆయనకు లేఖ రాసింది. మీడియా వ్యవహరించాల్సిన తీరుపై మీ అభిప్రాయాలు మీకు ఉంటే... తమ అభిప్రాయాలు తమకు ఉన్నాయని పేర్కొంది. ప్రజలకు వార్తలను ఎలా అందించాలో మీ నుంచి తెలుసుకోవాల్సిన స్థితిలో తాము లేమని చెప్పింది.

<strong>డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక, భయంలేని సత్య నాదెళ్ల</strong>డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక, భయంలేని సత్య నాదెళ్ల

అమెరికా అధ్యక్షుడి విషయాలకు తాము ప్రాధాన్యత ఇస్తామని, కానీ అది అంత ప్రధానమైనదేమీ కాదని తెలిపింది. అధ్యక్షుడు మాట్లాడేటప్పుడు ఎంతసేపు ప్రసారం చేయాలనేది మీడియాకు సంబంధించిన వ్యవహారమని, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని సూచించింది.

 An open letter to Trump from the US press corps

నిష్పక్షపాతంగా వ్యవహరించని పక్షంలో దేశాధ్యక్షుడిని సైతం ఎదుర్కొంటామని చెప్పింది. అమెరికా ప్రభుత్వ సమాచారాన్ని బహిర్గతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తామని తేల్చి చెప్పింది. అమెరికా ప్రభుత్వంతో కలసి పని చేస్తామని, అదే సమయంలో తప్పులను ఎత్తి చూపుతామని చెప్పింది.

ఇంతకు ముందు లేని విధంగా అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని పని చేస్తామని చెప్పింది. ఇది తమ ప్రసార కాలమని, కాలమ్స్, అంగుళాల స్థలమని, వాటిని మీరు ప్రభావితం చేయాలనుకుంటున్నారని, కానీ ఎలా చేయాలో నిర్ణయించేది తామేనని చెప్పింది.

ట్వీట్లు చేయడం ఇష్టం ఉండదు

ట్వీట్లు చెయ్యడం తనకు నచ్చదని ఫాక్స్‌ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు. అయితే తనకు నమ్మకం లేని మీడియా, నమ్మకం లేని ప్రెస్‌ దొరికిందని, దాంతో ఆరోపణలను తిప్పి కొట్టడానికి తనకున్న మార్గం కేవలం సోషల్‌ మీడియా మాత్రమేనని చెప్పారు.

English summary
An open letter to Trump from the US press corps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X