ఉబెర్ క్యాబ్ కోసం అపరకుబేరులు వెయిటింగ్..!!
వాషింగ్టన్: మొన్నటికి మొన్న అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ దేశాధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్‌లో ఆయనకు అరుదైన స్వాగతం లభించింది. అధ్యక్షుడు జో బైడెన్- ప్రథమ మహిళ జిల్ బైడెన్.. మోదీకి ప్రత్యేకంగా విందును ఇచ్చి గౌరవించారు. స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో పాటుగా పలువురు భారతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఇందులో పాల్గొన్నారు.
భారతీయ సంతతికి చెందిన ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ సీఈఓలు సుందర్ పిచయ్, సత్య నాదెళ్ల, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబాని, మహీంద్ర అండ్ మహీంద్ర చీఫ్ ఆనంద్ మహీంద్ర, ఇంద్రానూయి, యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో పాటు కేంద్ర మంత్రి సుబ్రమణ్యం జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాట్రా ఈ విందుకు హాజరయ్యారు.

ఈ టెక్ షేక్‌హ్యాండ్ సమావేశం తరువాత ఆనంద్ మహీంద్ర, ముఖేష్ అంబానీ, వృందా కపూర్.. వాషింగ్టన్‌లో నివసిస్తోన్న భారత సంతతికి చెందిన నాసా అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్‌ను కలిశారు. ఆమెతో సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీని ఆనంద్ మహీంద్ర.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సునీత విలియమ్స్‌ను కలుసుకోవడాన్ని ఓ అపురూప క్షణంగా అభివర్ణించారు. దీన్ని వాషింగ్టన్ మూమెంట్‌గా పేరు పెట్టుకున్నారు.
సునీత విలియమ్స్‌తో ముచ్చటించే క్రమంలో.. నెక్స్ట్ లంచ్ ఎంగేజ్‌మెంట్ కోసం ఏర్పాటు చేసిన గ్రూప్ షటిల్ బస్‌ను వారు మిస్ అయ్యారు. దీనితో ఉబేర్ క్యాబ్‌ను బుక్ చేసుకోవాల్సి వచ్చిందని ఆనంద్ మహీంద్ర చెప్పుకొచ్చారు. స్పేస్ షటిల్‌లో అంతరిక్షానికి వెళ్లొచ్చిన నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్.. ఉబేర్ క్యాబ్‌లో ట్రావెల్ చేయాల్సి వచ్చిందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications