జడలు విప్పుతున్న కరోనా రక్కసి ఇంకో కొత్త వేషం .. బ్రిటన్ లో ఇద్దరికి దక్షిణాఫ్రికా మరోకొత్త రకం స్ట్రెయిన్

కరోనా మహమ్మారి మరో వేషం దాల్చింది . ఇప్పటికే వచ్చిన కొత్త రకాన్ని మించిన వేగంతో వ్యాప్తి చెందేలా దక్షిణాఫ్రికాలో జడలు విప్పింది . యూకే లో కరోనా కొత్త వైరస్ కలకలం సృష్టిస్తున్న సమయంలో, ఇప్పుడు దక్షిణాఫ్రికా నుండి రూపాంతరం చెందిన మరో కొత్త కరోనా వైరస్ రకం పుట్టుకొచ్చింది. రోజుకో వేషం వేస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజాగజా వణికిస్తోంది.

దక్షిణాఫ్రికాలో జన్యు మార్పిడి జరిగి కొత్తగా పుట్టుకొచ్చిన మరో కొత్త రకం

దక్షిణాఫ్రికాలో జన్యు మార్పిడి జరిగి కొత్తగా పుట్టుకొచ్చిన మరో కొత్త రకం

దక్షిణాఫ్రికాలో జన్యు మార్పిడి జరిగి అక్కడ తీవ్రంగా ప్రబలుతున్న కరోనా మరోరకం తాజాగా లండన్ కు చేరుకుంది. ఇప్పటికే లండన్ వాసులు యూకేలో ఉన్న కొత్త కరోనా వైరస్ దెబ్బకు ఇళ్ల కే పరిమితమయ్యారు. లండన్ లో టైర్ త్రీ పరిమితులు విధించి, ప్రజలను బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే లండన్ లో ఇద్దరు పౌరులు దక్షిణాఫ్రికా లో తీవ్రంగా ప్రబలిన మరో రకం కరోనా వైరస్ బారిన పడినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక ఇదే విషయాన్ని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మట్ హన్ కాక్ వెల్లడించారు.

https://telugu.oneindia.com/new-year/

లండన్ లో దక్షిణాఫ్రికా రకం వైరస్ ఇద్దరిలో గుర్తించిన అధికారులు .. దక్షిణాఫ్రికా రాకపోకలు బంద్

లండన్ లో దక్షిణాఫ్రికా రకం వైరస్ ఇద్దరిలో గుర్తించిన అధికారులు .. దక్షిణాఫ్రికా రాకపోకలు బంద్

ప్రస్తుతం యూకేలో ప్రబలిన కొత్త రకం కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపించే లక్షణాలు దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ఇంకో రకం కరోనా వైరస్ కు ఉందని ఉత్పరివర్తనం కూడా చాలా త్వరగా జరుగుతుందని బ్రిటన్ ఆరోగ్య మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారి ద్వారా ఇది తమ దేశానికి వచ్చి ఉంటుందని వారు భావిస్తున్నారు.

ఈ క్రమంలో దక్షిణాఫ్రికా నుండి రాకపోకలు తక్షణం నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది బ్రిటన్ ప్రభుత్వం.

దక్షిణాఫ్రికా మరో కొత్త కరోనా వైరస్ పై కొనసాగుతున్న అధ్యయనం

దక్షిణాఫ్రికా మరో కొత్త కరోనా వైరస్ పై కొనసాగుతున్న అధ్యయనం

గత పదిహేను రోజుల్లో దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారు వెంటనే సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాలని కూడా ఆదేశించింది. అంతేకాదు వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు తక్షణం చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వారిని పట్టుకుని వారికి కరోనా పరీక్షలు చేసి వారిని క్వారంటైన్ చేసే పనిలో పడ్డారు . దక్షిణాఫ్రికా మరో కొత్త కరోనా వైరస్ పై వాయువ్య ఇంగ్లాండ్ లోనే ప్రత్యేక ప్రయోగశాలలో అధ్యయనం చేస్తున్నారు.

కరోనా జన్యు మార్పిడి జెట్ స్పీడ్ లో.. తీవ్ర ఆరోగ్య సంక్షోభంలో ప్రపంచం

కరోనా జన్యు మార్పిడి జెట్ స్పీడ్ లో.. తీవ్ర ఆరోగ్య సంక్షోభంలో ప్రపంచం


అసలే యూకే, బ్రిటన్ లలో ప్రబలిన కొత్త కరోనా స్ట్రెయిన్ పై ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో, దక్షిణాఫ్రికాకు చెందిన ఇంకొక రకం కరోనా వైరస్ మహమ్మారి దాడి చేయడం తీవ్ర ఆరోగ్య సంక్షోభానికి దారి తీస్తుంది.

ఇప్పటికే యూ కె, బ్రిటన్ ల నుండి వివిధ దేశాల కు వెళుతున్న ప్రయాణికులు అంటే అందరూ భయపెడుతున్న పరిస్థితి ఉంది. ఇండియాలో కూడా యూకే నుంచి వచ్చిన వారిలో చాలామంది లో కొత్తరకం కరోనా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో యూకే, బ్రిటన్ల నుండి విమానాలను రద్దు చేసి ఇండియాలోనూ కొత్త కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+