ఆగని విషాదం: బీచ్‌కు కొట్టుకొచ్చిన మరో చిన్నారి
జోహన్నెస్‌బర్గ్: ఇటీవల టర్కీ బీచ్‌కు కొట్టుకువచ్చిన సిరియా బాలుడు అయిలాన్ కుర్దీ మృతదేహం ప్రపంచాన్ని కదిలించింది. ఈ విషాద ఘటన మరువకముంగే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వలస పడవ సముద్రంలో మునిగిపోవడంతో చనిపోయిన నాలుగేళ్ల చిన్నారి మృత దేహం పశ్చిమ టర్కీలోని ఓ బీచ్‌కి కొట్టుకొచ్చింది.
ఐజ్మిర్ రాష్ట్రంలోని ఏజియాన్ పట్టణం సముద్రతీరానికి నాలుగేళ్ల బాలిక మృత దేహం కొట్టుకొచ్చిందని స్థానిక మీడియా వెల్లడించింది. అక్కడి మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. 15మందితో వెళుతున్న వలస పడవ అక్కడి చిసో శాంక్ అనే గ్రీకు ద్వీపం సమీపంలో మునిగిపోయింది.

ఎనిమిది మంది పిల్లలు సహా 14 మంది సిరియన్లను కోస్ట్ గార్డ్ దళాలు రక్షించాయి. ఈ నాలుగేళ్ల బాలిక మృతదేహం మాత్రం టర్కీ తీరానికి కొట్టుకువచ్చింది. సిరియాలో నెలకొన్న సంక్షోభంతో శరణార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.
కాగా, ఇటీవల మూడేళ్ల బాలుడు అయిలాన్ కుర్దీ మృత దేహం చిత్రం ప్రపంచం మొత్తాన్ని కన్నీరు పెట్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సిరియా శరణార్థులను తమ దేశాల్లోకి అనుమతించేందుకు పలు దేశాధినేతలు కూడా ముందుకు వచ్చారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications