వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడియాశ: మనుషులపై పని చేయని కరోనా మెడిసిన్: తొలి ప్రయత్నం దారుణంగా: సైడ్ ఎఫెక్ట్స్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: కరోనా వైరస్‌ పని పట్టడానికి పనికి వస్తుందంటూ ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన ఆ మెడిసిన్ ఏ మాత్రం ప్రభాన్ని చూపలేకపోయింది. మనుషులపై చేపట్టిన తొలి ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఫలితంగా కరోనా వైరస్ యాంటీ డ్రగ్‌ను కనుగొనడంలో మరింత జాప్యం చోటు చేసుకోవచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ లోగా మరెంత మందిని ఈ వైరస్ బలి గొంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కరోనా కాటుకు రెమిడిసివిర్‌తో చెక్ పడుతుందని భావించారు. గిలీడ్ సైన్స్ అనే చైనాకు చెందిన ఫార్మాసూటికల్స్ సంస్థ తయారు చేసిన ఈ మెడిసిన్‌ ఇది. తొలి ప్రయత్నంలో.. కరోనా వైరస్ సోకిన 237 మంది పేషెంట్లకు రెమిడిసివిర్ ద్వారా వైద్యాన్ని అందించాలని నిర్ణయించారు. అనంతరం వారిని వడపోశారు. 158 మందిని ఎంపిక చేశారు. వారిలో 79 మందికి రెమిడిసివిర్ ద్వారా వైద్యాన్ని అందించారు. వాటి ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.

Anti Covid-19 drug remdesivir Flops in First Human Trial: Reports

రెమెడిసివిర్‌ను అందించిన వారిలో 13.9 శాతం పేషెంట్లు మరణించారు. అదే సమయంలో ప్లాసెబోలో 12.8 శాతం పేషెంట్ల ఆరోగ్యం మెరుగుపడినట్లు గుర్తించారు. మిగిలిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లు తెలిపారు. దీనితో ఈ డ్రగ్ ద్వారా వైద్యం చేయడాన్ని నిలిపివేశారు. రెమిడిసివిర్‌‌తో వైద్యాన్ని అందించిన కొద్దిసేపటి తరువాత కొంతమంది పేషెంట్లలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని, ఫలితంగా ఈ ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చిందని అన్నారు. మనుషులపై రెమెడిసివిర్ తొలి ప్రయత్నం విఫలమైందనే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా ప్రకటించింది.

కరోనా వేళ.. ఒక్కసారిగా మారిన వాతావరణం: బెంగళూరులో కుండపోత: మరో మూడు రోజుల పాటుకరోనా వేళ.. ఒక్కసారిగా మారిన వాతావరణం: బెంగళూరులో కుండపోత: మరో మూడు రోజుల పాటు

Recommended Video

Coronavirus: COVID-19 Cases Reached 893 Mark In AP With 80 New Cases

తొలి ప్రయత్నం విఫలం కావడంపై ఈ డ్రగ్‌ను తయారు చేసిన గిలెడ్ నిరాశను వ్యక్తం చేసింది. తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తామని గిలీడ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ డ్రగ్ ఎందుకు పని చేయలేదనే విషయంపై ఆరా తీస్తున్నామని, సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని అన్నారు. ఈ మందును మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. తమ ప్రయత్నాలను విరమించుకోవట్లేదని గిలెడ్ సంస్థ ప్రతినిధి స్పష్టం ేశారు.

English summary
A potential antiviral drug for the coronavirus has reportedly failed in its first randomised clinical trial. There had been widespread hope that remdesivir could treat Covid-19. But a Chinese trial showed that the drug had not been successful, according to draft documents accidentally published by the World Health Organization. The drug did not improve patients' condition or reduce the pathogen's presence in the bloodstream, it said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X