వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలేం జరిగింది?: యాపిల్ ఐఫోన్ అంత గోప్యమా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఐఫోన్‌ను కలిగిన ఉన్న ఓ ఉగ్రవాది సృష్టించిన అరాచికం టెక్నాలజీ దిగ్గజం యాపిల్, అమెరికా దర్యాప్తు సంస్ధ ఎఫ్‌బీఐ మధ్య చిచ్చు రేపింది. అసలు ఇంతకీ యాపిల్, ఎఫ్‌బీఐ రెండింటికీ మధ్య చిచ్చుకు కారణమైన సంగతి ఏంటో ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

గత ఏడాది అమెరికా కాలిఫోర్నియా శాన్‌బెర్నార్డినోలో సయద్‌ రిజ్వాన్‌ ఫరూఖ్‌ అనే ఐఎస్‌ ఉగ్రవాది విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడి 14 మంది ప్రాణాల్ని బలిగొన్న సంగతి తెలిసిందే. తర్వాత రిజ్వాన్‌ వ్యక్తిగత ఐఫోన్‌ను ఎఫ్‌బీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హంతకుడి ఫోన్ హ్యాక్: కోర్టు ఆదేశాలకు యాపిల్ ‘నో'

దానిని అన్‌లాక్‌ చేసి ఇవ్వాలని యాపిల్‌ సంస్థను కోరారు. నిందితుడి ఐఫోన్‌లోని సమాచారాన్ని పొందేందుకు దానిని తెరిచే మాల్‌వేర్‌ తయారు చేయాలంటూ ఎఫ్‌బీఐ ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే అందుకు యాపిల్ మాత్రం విముఖతను వ్యక్తం చేసింది.

Apple: We tried to help FBI terror probe, but someone changed iCloud password

అలా మాల్‌వేర్‌ రూపొందిచండం వల్ల యాపిల్ కస్టమర్లందరి రక్షణను బలహీన పరుస్తుందని స్పష్టం చేసింది. ఉగ్రవాది దాడి ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తుపై తమకూ సానుభూతి ఉందనీ, అయితే, తమపై గూఢచర్యం చేసేందుకు మాత్రం తాము అంగీకరించబోమని చెబుతోంది.

దీనిపై ఎఫ్‌బీఐ కోర్టును ఆశ్రయించగా సయీద్‌ రిజ్వాన్‌ ఫారూఖ్‌ ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి ఎఫ్‌బీఐ దర్యాప్తు అధికారులకు సహకరించాలని అమెరికాలోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై న్యాయస్థానం ఆదేశాల్ని అమలు చేయడం తమ వినియోగదారులకు ప్రమాదకరమనీ, హ్యాకర్లకు అవకాశం కల్పించినట్లవుతుందని యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ పేర్కొన్నారు.

ఎఫ్‌బీఐకి మద్దతుగా జారీ అయిన కోర్టు ఆదేశాల్నీ సవాలు చేస్తామని తెలిపారు. ‘యూఎస్‌ ప్రభుత్వం ఓ అసాధారణమైన పని చేసి ఎఫ్‌బీఐకి సహకరించాలని కోరుతోంది. దీనివల్ల మా కస్టమర్ల భద్రత చిక్కుల్లో పడుతుంది. దీనిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామ'ని చెప్పారు.

2014 నుంచి వచ్చిన అధునాతన ఫోన్లలో డిఫాల్ట్‌ ఆటో ఎన్‌క్రిప్షన్‌ ఆప్షన్‌ ఆన్‌ చేసి ఉంటే సమాచారం నేరుగా భద్రపర్చుకునే అవకాశం ఉంటుంది. దీనిని చూడాలంటే కచ్చితంగా కోడ్‌ తెలిసి ఉండాలి. ఒక వేళ 10 సార్లు తప్పు కోడ్‌ వాడితే భద్రపర్చిన సమాచారం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. తమ సిబ్బంది కూడా దీనిని తెరవలేరని యాపిల్‌ సంస్థ స్పష్టం చేసింది.

వాస్తవానికి ఐఫోన్‌ను దాని వినియోగదారులే తెరవాల్సి ఉంటుంది. అయితే పోలీసులు కాల్పుల్లో ఉగ్రవాది ఫరూఖ్‌ ఫోన్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో టెక్‌ కంపెనీలు పోలీసులకు ఏదో ఒక మార్గాన్ని చూపాల్సిందేనని ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్‌ కోమీ అంటున్నారు.

ఎన్నిసార్లు తప్పు కోడ్‌ ఇచ్చినా డేటా పోకుండా ఉండే అవకాశం కల్పించాలని ఎఫ్‌బీఐ డైరెక్టర్ యాపిల్‌ను కోరారు. కాగా, ఫరూఖ్‌ నాలుగు అంకెల కోడ్‌ వాడి ఉంటాడని భావిస్తున్నారు. దీని కోసం దాదాపు 10000 కాంబినేషన్లను వాడాల్సి ఉంటుంది.

అయితే దీనిపై అమెరికా ప్రజల భద్రతకన్నా చనిపోయిన ఓ ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాది వ్యక్తిగత అంశాల్ని కాపాడేందుకు టెక్ దిగ్గజం యాపిల్‌ ప్రాధాన్యమిస్తోందని ఆర్కాన్సాస్‌ సెనేటర్‌ టామ్‌ కాటన్‌ విమర్శించారు.

English summary
On Friday, an Apple executive explicitly confirmed what was stated in a government court filing earlier in the day: that in the early hours of the San Bernardino terrorism investigation, county officials may have inadvertently compromised their ability to access the data on the seized iPhone 5C.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X