20 ఏళ్లుగా కూతురిపై రేప్: ఏడుగురు పిల్లలకు జన్మ

అర్జెంటీనా: రెండు దశాబ్దాలుగా కూతురిపై అత్యాచారానికి పాల్పడుతూ ఆమెతో ఏడుగురు పిల్లలను కన్న తండ్రి వైనం వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసిన ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూతురిపై పసి ప్రాయంలోనే అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. 31 ఏళ్లు వచ్చే సరికి ఆమె ఏడుగురికి తల్లి అయింది.

బాధితురాలి కథనం ప్రకారం - తనకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు అమ్మ మృతి చెందింది. అప్పటి నుంచి ఆమెను తండ్రి లొంగదీసుకున్నాడు. ఇప్పుడు ఆమె వయస్సు 31 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో కూడా తండ్రి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె ఏడుగురి పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన అర్జెంటీనాలోని లాస్ టెర్మాస్ డే రియో హోండోలోని గ్రామంలో చోటు చేసుకుంది.

Argentinian man arrested after 'fathering 7 children with his own daughter

అయితే ఓ బిడ్డ అనారోగ్యానికి గురికావడంతో చిన్నారిని తీసుకుని ఆమె ఆస్పత్రికి వెళ్లింది. చిన్నారి తండ్రి ఏవరు డాక్టర్ ప్రశ్నించడంతో చిన్నారి తండ్రే తన తండ్రి అని చెప్పింది. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.

తన కథను పోలీసులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఆమె 56 ఏళ్ల తండ్రిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని తన తండ్రి బెదిరించాడని బాధితురాలు చెప్పింది. ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని కూడా బెదిరిస్తున్నాడని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+