వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Dooms Day: భూమి వైపు దూసుకొస్తోన్న ఈజిప్షియన్ దేవత: ఎప్పటికైనా పెను ముప్పే

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: మరో గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోంది. ఈస్టర్న్ టైమ్ ప్రకారం.. ఈ రాత్రి 8:15 నిమిషాలకు ఇది భూమికి అతి సమీపానికి చేరుకుంటుంది. విశ్వాంతరాల్లోకి వెళ్లిపోతుంది. భూమికి సమీపానికి చేరిన సమయంలో దాని వేగం సెకెనుకు కొన్ని వందల కిలోమీటర్ల మేర ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. సమీపానికి చేరిన సమయంలో భూమి-గ్రహశకలం మధ్య ఉన్న దూరం 10 లక్షల కిలోమీటర్ల కంటే తక్కువే ఉంటుందని పేర్కొంది.

2004లో

2004లో

ఈ గ్రహశకలానికి అపోఫిస్‌గా నామకరణం చేశారు అంతరిక్ష పరిశోధకులు. దానికి గాడ్ ఆఫ్ ఛావోస్‌ (God of Chaos)గా ముద్దుపేరు పెట్టారు. గాడ్ ఆఫ్ ఛావోస్.. ఈజిప్షియన్ దేవత పేరు. 2004లో తొలిసారిగా ఈ గ్రహశకలాన్ని గుర్తించారు. వారి అంచనాకు తగ్గట్టే.. 17 సంవత్సరాల తరువాత అది భూమికి చేరువ అవుతోంది. సుమారు 1,200 అడగుల పొడవు ఉన్న ఈ గ్రహశకలం మళ్లీ.. 2029, 2036లో భూమికి అతి సమీపానికి చేరుకుంటుందని అంచనా వేస్తోన్నారు.

2068 నాటికి..

2068 నాటికి..

2036లో ఆ అస్టరాయిడ్ భూమికి అత్యంత సమీపానికి చేరుకోవచ్చని, పెను ప్రభావాన్ని చూపించడానికి అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి డూమ్స్ డే గ్రహశకలంగా (Doomd Day asteroid) గా నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎప్పటికైనా ఇది భూమికి ప్రమాదకరమేనని అభిప్రాయపడుతున్నారు. ఈ గ్రహశకలం భూమికి అతి సమీపం నుంచి వెళ్లే దృశ్యాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి యూరోపియన్ వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. 2068 నాటికి నేరుగా భూమిని ఢీ కొట్టే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేస్తోన్నారు.

అన్నిటికంటే ప్రమాదకరమైనదిగా..

అన్నిటికంటే ప్రమాదకరమైనదిగా..

ఇదివరకు తాము గుర్తించిన ఏ అస్టరాయిడ్‌తోనూ ఈ స్థాయిలో ప్రమాదకర పరిస్థితులు ఎదురు కాలేదని చెబుతున్నారు. ప్రస్తుతానికి భూమికి అతి చేరువగా వచ్చిన అనంతరం అది సూర్యుడి చుట్టూ తిరుగుతుంటుందని, దాని పరిభ్రమణ దిశ మారితే తప్ప ముప్పు తప్పకపోవచ్చని అంటున్నారు. అందుకే-దానికి గాడ్ ఆఫ్ ఛావోస్ అని ముద్దు పేరు పెట్టారట. గ్రహశకలం పరిభ్రమణ కాలం, సమయం.. మిగిలిన వాటి కంటే భిన్నంగా ఉందని అంచనా వేస్తోన్నారు.

హిరోషిమా కంటే

హిరోషిమా కంటే

ఈ గ్రహశకలం భూమిని ఢీకొనడమంటూ జరిగితే- 1945లో హిరోషిమాపై చోటు చేసుకున్న అణుబాంబు దాడి కంటే 15 కిలో టన్నుల మేర అధికంగా ట్రైనైట్రోటోల్యురెన్స్ (TNT)ల మేర శక్తి ఉద్భవిస్తుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తోన్నారు. దీని వేగం ఇదివరకు తాము గుర్తించిన అస్టరాయిడ్ల కంటే ఊహించనంతగా ఉందని, దాని పరిభ్రమణం అదే స్థాయిలో ఉందని అంతరిక్ష పరిశోధకులు స్పష్టం చే్స్తోన్నారు. అత్యంత ఆసక్తిని, ఆందోళను కలిగించే అంతరిక్ష అద్భుతాల్లో ఈ అస్టరాయిడ్‌ను చేర్చామని నాసా పేర్కొంది.

English summary
The “God of Chaos” will be passing by Earth today. The asteroid Apophis, nicknamed “God of Chaos” after the Egyptian deity, will fly past Earth around 8:15pm ET, traveling at a distance of nearly 10-million miles away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X