ప్రపంచమే ఆశ్చర్యపోయేలా! గంటకు 407కి.మీ.. దుబాయ్ పోలీస్ వద్ద సూపర్ కారు..

Subscribe to Oneindia Telugu

దుబాయి: అత్యాధునిక కట్టడాలకు నెలవైన దుబాయ్.. ఇప్పుడు సరికొత్త పోలీసు వాహనాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఏకంగా గంటకు 407కి.మీ వేగంతో పరిగెత్తే బుగాటీ వైరాన్ అనే లగ్జరీ కారును దుబాయ్ పోలీసులు సమకూర్చుకున్నారు. కేవలం రెండంటే రెండు సెకన్లలోనే ఇది జీరో నుంచి 97కి.మీ వేగాన్ని అందుకోగలగడం దీని విశేషం.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే పోలీస్ కారు ఇదేనని గిన్నిస్ బుక్ సంస్థ అధికారులు కూడా ధ్రువీకరించారు. దీని ఖరీదు సుమారు రూ.10.05కోట్ల దాకా ఉండవచ్చునని తెలుస్తోంది. 16సిలిండర్స్ ను కలిగి ఉండే ఈ కారు ఇంజన్ వెయ్యి హార్స్ పవర్ ను ఉత్పత్తి చేయడం విశేషం. దుబాయ్ పోలీసులు వాడుతున్న అత్యాధునిక సూపర్ కారు ఇదేనని అక్కడి పోలీస్ అధికారులు చెబుతున్నారు.

At 407 Kms Per Hour, Dubai Is Home To The World's Fastest Police Car

బుర్జ్ ఖలీఫా టవర్, షేక్ మహమ్మద్ బిన్ రషీద్ బౌల్వర్ట్ లాంటి ప్రదేశాల్లో ఈ కారు పర్యాటకులను ఆకట్టుకుంటుందని అక్కడి పోలీసులు అభిప్రాయపడుతున్నారు. చాలామంది కారు విశేషాలు తెలుసుకోవడానికి ఫోన్లు చేస్తున్నారని, కారు వద్దకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నారని అన్నారు. ఇలాంటి కార్లతో పోలీసుల పని మరింత సులువు అవుతుందని దుబాయ్ పోలీస్ లెఫ్టినెంట్ సుల్తాన్ రషీద్ అల్ షమ్సి తెలిపారు.

కాగా, దుబాయ్ పోలీసుల వద్ద మొత్తం 14 సూపర్ ఫాస్ట్ కార్లు ఉన్నాయి. మెక్ లారెన్ ఎంపీ4-12, లాంబోర్గిని అవెంటడార్, ఫెరారి ఎఫ్ఎఫ్, మెర్సిడెస్ ఎస్ఎల్ఎలస్ ఏంఎజీ, రౌష్ మస్టాంగ్, బెన్నెట్లీ కాంటినెంటల్ జీటీ, ఆడి ఆర్8వి01, ప్లస్, నిస్సాన్ జీటీఆర్, మెర్సిడెస్ ఎస్ఎల్36 ఏఎంజీ లాంటి లగ్జరీ కార్లు చాలా ఉన్నాయి. వీటితో పాటు ఆస్టన్ మార్టిన్ వన్-77, హైబ్రిడ్ పోర్షే పనామెరా, బీఎండబ్ల్యూ గ్రాన్ క్రూప్, మెర్సిడెస్ జి36 ఏఎంజి లాంటి లిమిటెడ్ ఎడిషన్ కార్లు కూడా దుబాయ్ పోలీస్ యంత్రాంగం వద్ద ఉన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dubai is now officially home to the fastest police car in the world. That's right. The Bugatti Veyron, a luxury supercar which is part of the Dubai police's fleet of patrol cars, has been officially certified by the Guinness Book of World Records
Please Wait while comments are loading...