ఆప్ఘాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు: 12 మంది మృతి, 30 మందికిపైగా గాయాలు
కాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది గాయపడ్డారు. కాబూల్‌లోని ఓ మసీదు దగ్గర ఈ పేలుడు సంభవించింది. జనసమ్మర్థం ఎక్కువగా ఉండటంతో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఈ పేలుడుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆప్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఖారీ సయీద్ ఖోస్ట్లీ తెలిపారు. కాబూల్‌లోని ఈద్ గహ్ మసీదు దగ్గర ఈ పేలుడు సంభవించిందని ఆయన తెలిపారు.

తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అమ్మ స్మారక సభ జరుగుతోన్న మసీదు లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరిగినట్లు వెల్లడించారు. మరో మంత్రి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. ఈ పేలుడు కారణంగా చాలా మంది మరణించారని తెలిపారు. పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
Recommended Video
ఇప్పటి వరకు ఈ పేలుడుకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యతను ప్రకటించలేదు. కాగా, ఆప్ఘానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర దాడులు పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. తాలిబన్లకు శత్రువులుగా భావించే వీరి ప్రాబల్యం నంగర్‌హార్ తూర్పు ప్రావిన్సులో అధికంగా ఉంది. జలాలాబాద్‌లోనూ ఇది వరకు హత్యలు, దాడులకు పాల్పడినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది.












Click it and Unblock the Notifications