కారులో వచ్చి బాంబు పేల్చాడు, నలభై మంది మృతి
పార్క్ అయిన కారులో బాంబు పేలి ఇరవై అయిదు మంది నుంచి నలభై మంది వరకు మృతి చెందిన సంఘటన మాలిలో చోటు చేసుకుంది.
మాలి: పార్క్ అయిన కారులో బాంబు పేలి ఇరవై అయిదు మంది నుంచి నలభై మంది వరకు మృతి చెందిన సంఘటన మాలిలో చోటు చేసుకుంది. మాలిలోని మిలటరీ క్యాంపులో ఈ విషాదం జరిగింది.
ఇది ఆత్మహుతి దాడి. 25 నుంచి 40 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆత్మహుతి దాడికి పాల్పడిన వ్యక్తి కారులో వచ్చి తనను పేల్చుకొని ఘాతుకానికి పాల్పడ్డాడు.

దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న గావో ఎయిర్‌పోర్టు సమీపంలోని మాజీ తిరుగుబాటుదారులు, సైనికుల స్థావరాలపై దాడి జరిగింది. దాదాపు అరవై మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మాలీ అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications