ఉగ్రదాడి: 27మంది మృతి, 100మందికి గాయాలు
ఇస్తాంబుల్: టర్కీలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 27మంది మృతిచెందగా, 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ఘటన సురుక్ ప్రాంతంలోని ఇరాక్ సరిహద్దుకు సమీపాన టర్కీ శాన్ లిర్ఫా ప్రొవిన్స్ వద్ద చోటుచేసుకున్నట్టు అక్కడి ఓ మీడియా నివేదించింది.
ఈ ఘటన జరిగిన సమయంలో 300 మంది సోషలిస్ట్ యూత్ అసోసియేషన్ ఫెడరేషన్ సభ్యులు అమరా సాంస్కృతిక కేంద్రం వద్ద పనిచేస్తున్నట్లు తెలిసింది.
వీరంతా వేసవి సాహస యాత్రలో భాగంగా కోబేన్ పుననిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించిందని స్థానిక మీడియా పేర్కొంది.
ఈ పేలుడులో గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే ఈ పేలుడు ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications