వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాంకాంగ్ ప్రజల నిరసనలు తారాస్థాయికి: టియర్ గ్యాస్ ప్రయోగం, 30మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

హాంకాంగ్: చైనా పెత్తనాన్ని తాము అంగీకరించమని హాంకాంగ్ యువత గత నెల రోజులుగా తీవ్ర ఆందోళనల బాట పట్టిన విషయం తెలిసిందే. లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటూ నినదిస్తున్నారు.

నాయకుడు లేకుండా ఈ ఉద్యమం ఉధృతంగా సాగుతుండటం గమనార్హం. కాగా, ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు చైనా ప్రభుత్వ వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా, స్పాంజ్ గ్రెనెడ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో 30 మంది నిరసనకారులకు తీవ్ర గాయాలయ్యాయి.

e fire tear gas in Hong Kong

హాంకాంగ్ నగరంలోని చైనీస్ యూనివర్సిటీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హాంకాంగ్ నుంచి చైనాకు నేరస్తులను అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా ఈ నిరసనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. నేరస్తుల అప్పగింత బిల్లుకు ఆమోదం లభిస్తే.. హాంకాంగ్ పూర్తిగా చైనా నియంత్రణలోకి వెళుతోందని నిరసనకారులు ఆందోళన చెందుతున్నారు.

ఈ బిల్లు ఆమోదం పొందితే హాంకాంగ్ కూడా చైనాలోని ఇతర నగరాల మాదిరే అవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు నెలరోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు. తమ హక్కులను కాపాడుకుంటామంటూ నినదిస్తున్నారు. చైనా పెత్తనం తమపై అవసరం లేదని అంటున్నారు.

కాగా, ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతుండటంతో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆందోళనల్లో ఓ పౌరుడిని సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. నిరసనకారులతో విభేదించిన కారణంగానే అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఆరోపణలున్నాయి.

English summary
As many as 30 protestors were injured after Hong Kong police fired sponge grenade and gas canister at the Chinese University in the city, news agencies reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X