వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్యత్వం పోతుందని.. అమ్మాయిలకు పరుగు నిషేధం: ప్రిన్సిపాల్‌పై కేసు

|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్: కన్యత్వం కోల్పోతారనే మూఢనమ్మకంతో పరుగు పోటీల్లో పాల్గొన వద్దని హుకుం జారీ చేశారు ఓ ఇస్లామిక్ కళాశాల ప్రిన్సిపాల్. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.

‘ది ఏజ్' కథనం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని ట్రుగనినా సూబర్బ్‌లోని అల్ తఖ్వా అనే కాలేజీలో ఉన్నపలంగా అమ్మాయిలెవరూ ఆటల్లో పాల్గొనవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అదే కళాశాలలో గతంలో పనిచేసిన ఓ ఉపాధ్యాయుడు విక్టోరియన్ రిజిస్ట్రేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ అథారిటీ (వీఆర్ క్యూఏ)కి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.

 Aus Islamic college bans girls' running over 'virginity' fears

ప్రిన్సిపాల్ అమ్మాయిల విషయంలో వివక్ష చూపుతున్నాడని, వారిని తప్పుడు ఉద్దేశాలతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన అథారిటీ అధికారులు అసలు విషయం రాబట్టారు.

కళాశాల ప్రిన్సిపాల్ ఒమర్ హల్లాక్ మూఢ మత విశ్వాసాలకు బద్ధుడై ఉండి అమ్మాయిలు పరుగెత్తితే వారి కన్యత్వాన్ని కోల్పోతారని, సాకర్ వంటి ఆటలు ఆడటం వల్ల సంతాన లేమి సమస్యలు కూడా వస్తాయని భావించి వారిని ఆటల్లో పాల్గొనకుండా నిషేధం విధించాడని అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో కళాశాల ప్రిన్సిపాల్‌ను నిందితుడి తేల్చి కేసు నమోదు చేశారు.

English summary
An Islamic college here has banned its girl students from participating in running competitions as its principal believes it may cause them to "lose their virginity", prompting an investigation by an Australian regulatory body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X