వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతం: వెతికి మరీ స్పెర్మ్‌ డోనర్‌ను పెళ్లాడింది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

తనకు కుమార్తె పుట్టడానికి వీర్యదానం చేసిన స్పెర్మ్ డోనర్‌ను వెతికి మరీ పట్టుకుని ఓ ఆస్ట్రేలియా మహిళ పెళ్లాడింది. వివరాల్లోకి వెళితే... బ్రిటన్‌లో జన్మించి ఆ తర్వాత ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన అమిన్హా హర్ట్‌ తన అనుభవాలతో ఇటీవల ఓ పుస్తకం రాసింది.

లైలా అనే కుమార్తె జన్మించిన తర్వాత వీర్యదానం చేసిన స్కాట్ ఆండర్సన్ (45) అనే రైతుని వ్యక్తిని పెళ్లాడింది. తనకు వీర్యదానం చేసేందుకు ముందుకు వచ్చిన జాబితాలో స్కాట్‌ను ఎంపిక చేసింది. తాను సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నానని అతను చెప్పడంతో అతన్ని అంగీకరించింది.

అనంతరం ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) ద్వారా అమిన్హా అనే కూతురికి జన్మించింది. ఐవీఎఫ్ విధానంలో మానవ శరీరం బయటే అండాన్ని వీర్యం ద్వారా ఫలదీకరణ చేసే విషయం తెలిసిందే. ఆ తర్వాత తన బిడ్డకు జన్మనిచ్చిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో అతని ఆచూకీ కోసం ప్రయత్నించింది.

Australian woman tracks down and marries sperm donor

చివరకు చివరకు ఐవీఎఫ్ ఆస్పత్రి ద్వారా అతని వివరాలు కనుక్కుంది. తన వీర్యదానం ద్వారా పుట్టిన బిడ్డ అచ్చం తనలాగే ఉండటంతో స్కాట్‌ ఆశ్చర్యపోయాడు. 'చిన్నారి ఎలా ఉందో చూడాలని ఉండటంతో మొదట ఆమెను కలిశాను. ఆ తర్వాత ఆమె పట్ల నాలో ప్రేమ మొదలైంది' అని స్కాట్ చెప్పాడు.

గతంలో ఆమె ఇద్దరు వ్యక్తులతో అనుబంధం నెరిపినప్పటికీ... ఈ ఇద్దరి ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు చిన్న వయసులోనే ప్రాణాలు విడిచారు. తనకు జన్యుపరమైన సమస్య ఉండటం వల్ల ఇలా జరిగిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

నాకంటూ ఓ శిశువు ఉంటే తాను వీర్యదాత కోసం, ఐవీఎఫ్ విధానం కోసం ప్రయత్నించేదానిని కాదని ఈ సందర్భంగా హర్ట్ తెలిపింది. త్వరలోనే ఆమె జీవితకథ త్వరలోనే సినిమా తీసే ఆలోచనలో ఉన్నారు.

English summary
An Australian woman has tracked down and married the sperm-donor father of her child, according to a report published in the UK daily The Independent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X