ఆస్ట్రియా రాజధానిపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు: ముంబై తరహాలో దాడులు: పలువురి మృతి
వియన్నా: ఆస్ట్రియా రాజధాని వియన్నాపై గుర్తు తెలియని విరుచుకు పడ్డారు. కాల్పులు జరిపారు. జనంపై బుల్లెట్ల వర్షాన్ని కురిపిపించారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా నిర్ధారించారు. ఆ కిరాతకుల కోసం జల్లెడ పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
CONFIRMED at the moment:
— POLIZEI WIEN (@LPDWien) November 2, 2020
*08:00 pm: several shots fired, beginning at Seitenstettengasse
*several suspects armed with rifles
*six different shooting locations
* one deceaced person, several injured (1 officer included)
*1 suspect shot and killed by police officers #0211w
ఆస్ట్రియా కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 8 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమల్లోకి తీసుకొచ్చిన సుదీర్ఘ లాక్‌డౌన్ సడలించడంతో జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదికి వచ్చారు. నైట్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. జనం పెద్ద సంఖ్యలో గుమికూడి ఉన్న ప్రదేశాలు, కేఫ్, రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా బుట్లెట్ల వర్షాన్ని కురిపించారు. లైవ్‌లీ స్ట్రీట్‌లోని ఓ రెస్టారెంట్‌పై తొలుత కాల్పులు జరిపారు.
Nous, Français, partageons le choc et la peine du peuple autrichien frappé ce soir par un attentat au cœur de sa capitale, Vienne. Après la France, c’est un pays ami qui est attaqué. C’est notre Europe. Nos ennemis doivent savoir à qui ils ont affaire. Nous ne céderons rien.
— Emmanuel Macron (@EmmanuelMacron) November 2, 2020
ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకులతో నడిరోడ్డు మీద తిరుగుతూ కనిపించిన వారిపై కాల్పులు జరిపిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కాల్పులు జరిపిన వారు ఒకరి కంటే ఎక్కువ మందే ఉంటారని అనుమానిస్తున్నారు. దుండుగులు ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. దీన్ని ఉగ్రవాదచర్యగా భావిస్తున్నామని వియన్నా నగర పోలీసులు వెల్లడించారు.
Still active: Stay at home! If you're on the Streets, take shelter! Keep away from public places, don't use public Transportation! #0211w
— POLIZEI WIEN (@LPDWien) November 2, 2020

యాంటీ సెమిటిక్ అటాక్‌గా నిర్ధారించారు. యూదుల పవిత్ర స్థలం సమారిటన్ సైనాగోగ్‌పైనా దుండగులు కాల్పులు జరిపారు. సైనాగోగ్ భవనం వంద రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. కాల్పులు జరిపిన వారి కోసం నగరం అంతా గాలిస్తున్నారు. నగర వ్యాప్తంగా అమర్చిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వారి కోసం అన్వేషిస్తున్నారు. ఈ కాల్పుల్లో 15 మంది గాయపడ్డారని, వారికి అత్యవసర చికిత్సను అందిస్తున్నామని వియన్నా మేయర్ మైఖెల్ లుడ్విగ్ తెలిపారు. వారిలో ఏడుమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.
I am deeply shocked by the terrible attacks in Vienna tonight. The UK’s thoughts are with the people of Austria - we stand united with you against terror.
— Boris Johnson (@BorisJohnson) November 2, 2020
ఈ ఘటనపై ఆస్ట్రియా పలు దేశాధినేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మానవాళిపై జరిగిన దాడిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మక్రాన్ అభివర్ణించారు. కొద్దిరోజుల కిందటే ఫ్రాన్స్‌లో ఓ చర్చిపై దాడి జరిగిన తరహాలోనే ఈ ఘటన కూడా ఉందని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధఇ మారియా జఖారొవా, ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఛార్లెస్ మైఖెల్ ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణంచారు. ఆస్ట్రియా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications