రాముడు నడయాడింది అయోధ్యేనా ? మరి ఇరాక్‌లో ఏంటీ ?

లక్నో : కలియుగ క్షేత్రపాలకుడు, హిందువుల ఆరాధ్య దైవం రాముడి ఆనవాళ్లు విదేశాల్లోనూ కనిపిస్తున్నాయి. రాముడు నడయాడిన నేల అయోధ్య కాగా .. ఖండాలు దాటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీనిపై విభిన్న వాదనలు ఉన్నా .. ఏ అంశంపై పూర్తి క్లారిటీ మాత్రం రాలేదు.

ఇరాక్‌లో ఆనవాళ్లు ..
ఆసియాలోని ముస్లిం దేశాల్లో ఒకటి ఇరాక్. ఇక్కడ హిందువులు తక్కువ. అయితే అక్కడ రాముడి ఆనవాళ్లు కనిపించాయి. హోరెన్ షెకాన్ ప్రాంతంలోని దర్బాంద్ ఇ బెలుల కొండపై ఆనవాళ్లను గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అయోధ్య శోధ్ సంస్థాన్ బృందం వీటిని గుర్తించినట్టు పేర్కొంది. అక్కడ తాము రెండు చిత్రాలను గుర్తించామని వెల్లడించింది. ఒకటి రాముడు విల్లు పట్టుకున్నట్టుగా ఉండగా .. మరోటి హనుమంతుడి రూపంలో ఉందని ప్రతినిధులు మీడియాకు తెలిపారు.

Ayodhya Shodh Sansthan Investigates 4,000 Year Old Mural In Iraq Believed To Depict Lord Ram And Hanuman

పాత చిత్రాలే .. కానీ ...
ఈ రెండు చిత్రాలు క్రీస్తు పూర్వం 2 వేల సంవత్సరం నాటివని వారు అంచనా వేస్తున్నారు. ప్రాచీన కాలంలో అత్యున్నత నాగరికతలుగా పేరొందిన సింధు, మెసపటోమియా నాగరికతల మధ్య సంబంధాన్ని ఈ చిత్రాల ద్వారా గుర్తించే అవకాశం ఉందన్నారు. అయితే ఈ చిత్రాలు గతంలో ఆ ప్రాంతాన్ని పాలించిన రాజుకు సంబంధించినవై ఉంటాయని ఇరాక్ చరిత్రకారులు చెప్తున్నారు. బెలులా పాస్‌లో రాముడి జాడకు సంబంధించి పురాణ ఆధారాలు ఉన్నాయి.

దీనికి సంబంధించి అన్వేషణ చేసేందుకు ఇరాక్ ప్రభుత్వాన్ని అనుమతి కోరామని ప్రతినిధి బృందం తెలిపింది. సిందు, మెసపటోమియా నాగరికతల మధ్య సంబంధాన్ని విశదీకరించేందుకు ఇది మొదటి అధికార ప్రయత్నమవుతుందని పేర్కొన్నారు. క్రీస్తు పూర్వం 4500-1900 మధ్య లోయర్ మెసపటోమియాను సుమేరియన్లు పాలించారని .. వీరు భారత్ వచ్చారని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+