వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో గుర్తించిన B.1.617 రకం ఇప్పుడు 60 దేశాలకు వ్యాపించింది: WHO, ఇండియన్ వేరియంట్ అనొద్దు

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా ఉండటానికి, మరణాలు భారీగా నమోదుకావడానికి కారణమైన బీ.1.617 కొవిడ్ వేరియంట్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక విషయాన్ని వెల్లడించింది. భారత్ లో ప్రస్తుతం 55 శాతం కేసుకు కారణమైన ఆ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. బుధవారం నాటికి బీ.1.617 వేరియంట్ మొత్తం 60 దేశాలకు వ్యాపించిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

కరోనాపై కేంద్రం సంచలన ప్రకటన-గాలి ద్వారానే వైరస్ వ్యాప్తి-కొవిడ్ ప్రోటోకాల్స్ సవరణ,కొత్త గైడ్ లైన్స్కరోనాపై కేంద్రం సంచలన ప్రకటన-గాలి ద్వారానే వైరస్ వ్యాప్తి-కొవిడ్ ప్రోటోకాల్స్ సవరణ,కొత్త గైడ్ లైన్స్

భారత్‌లో గుర్తించిన కరోనా రకం(B.1.617) ఇప్పుడు 53 దేశాలకు పాకిందని డబ్ల్యూహెచ్ఓ చెప్పగా, అనధికారికంగా అందిన సమాచారం ప్రకారం.. మరో ఏడు దేశాలకు కూడా ఆ వైరస్ రకం విస్తరించిందని, దాంతో B.1.617 రకం బయటపడిన దేశాల సంఖ్య 60కి చేరినట్లు తెలుస్తోంది. ఈ కొత్త రకం వేగంగా సంక్రమిస్తోందని, అయితే దీని బారిన పడినవారిలో తీవ్రత ఏవిధంగా ఉంటుందనేదానిపై పరిశీలన జరుగుతోందని సంస్థ తెలిపింది.

B.1.167 Covid-19 variant found in 60 territories says WHO, stop calling Indian variant

ప్రమాదకర వేరియంట్లు పుట్టిన కారణంగా వాటిని ఆయా దేశాల పేర్లతో పిలవడం తీవ్ర వివాదాస్పదమవుతోన్న నేపథ్యంలో B.1.617ను ఇండియన్ వేరియంట్ అనిగానీ, మరే ఇతర వేరియంట్లను దేశాల పేర్లతో పిలవడం తగదని కూడా డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. బ్రిటన్‌(B.1.1.7), దక్షిణాఫ్రికా(B.1.351), బ్రెజిల్‌(P.1), భారత్‌(B.1.617)లో మొదట గుర్తించిన కరోనా కొత్త రకాలను ఆరోగ్య సంస్థ ఆందోళన కలిగించే రకాలుగా వర్గీకరించింది. ఈ రకాలన్ని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించి వైరస్ వ్యాప్తిని మరింత పెంచాయి.

వైరస్‌లో కొత్తరకాలు ఊహించినవేనని, కరోనా వైరస్ ఎంతగా విస్తరిస్తే..అన్ని కొత్త రకాలు వెలుగుచూసే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతున్నది. అందుబాటులో ఉన్న చర్యల ద్వారా వ్యాప్తిని అరికట్టాలని ప్రపంచ దేశాలకు సూచించింది. బుధవారం నాటికి గ్లోబల్ గా 16కోట్ల మందికి ఇన్ఫెక్షన్ సోకగా, 35లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే,

 పతంజలి రాందేవ్‌పై పరువు నష్టం దావా -రూ.1000కోట్లకు ఐఎంఏ నోటీసులు -కేంద్రం హెచ్చరించినా తగ్గని యోగా గురు పతంజలి రాందేవ్‌పై పరువు నష్టం దావా -రూ.1000కోట్లకు ఐఎంఏ నోటీసులు -కేంద్రం హెచ్చరించినా తగ్గని యోగా గురు

బీ.1.617 కొవిడ్ వేరియంట్ ఇప్పటికే 60 దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్ఓ చెప్పగా, దేశంలో ఆ రకం ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం అనేక కరోనా వేరియంట్లు వ్యాపిస్తున్నప్పటికీ, బి. 1.617 వేరియంట్ అత్యంత తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోందని, దేశంలోని 55 శాతం కొవిడ్ కేసులకు ఆ రకమే కారణమని మంత్రి చెప్పారు. కొవిడ పరిస్థులపై కేంద్ర కేబినెట్ లోని ఇతర మంత్రులకు బ్రీఫింగ్ ఇస్తూ ఆయనీ కామెంట్లు చేశారు.

English summary
The coronavirus variant first detected in India has now been officially recorded in 53 territories, a World Health Organization report showed Wednesday. The WHO has received information from unofficial sources that the B.1.617 variant has been found in seven further territories, figures in the UN health agency's weekly epidemiological update showed, taking the total number to 60. The report said B.1.617 had shown increased transmissibility, while disease severity and risk of infection were under investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X