ఫెర్రీ జలసమాధి.. నలుగురు మృతి, 38 మంది గల్లంతు !
ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి సమీపంలో ఓ ఫెర్రీ ఘోరంగా మునిగిపోయిన ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఇప్పటివరకు నలుగురు మృతదేహాలు బయటపడగా, 23 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ దుర్ఘటనలో 38 మంది గల్లంతవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
వాతావరణమే ప్రధాన కారణమా..?
తూర్పు జావాలోని బన్యువాంగి జిల్లాలోని కెటపాంగ్ పోర్ట్ నుంచి బాలి ద్వీపంలోని గిలిమానుక్ పోర్ట్‌కు వెళ్లే దాదాపు 5 కిలోమీటర్ల సముద్ర మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫెర్రీ బయలుదేరిన 25 నిమిషాల్లోనే అది సముద్రంలో మునిగిపోయిందని సమాచారం. ఈ మార్గం ఇండోనేషియాలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఒకటిగా చెబుతున్నారు. బలమైన గాలులు, 2.5 మీటర్ల ఎత్తైన అలలు, తీవ్రమైన ప్రవాహాల వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని సెర్చ్ అండ్ రెస్క్యూ అధికారులు తెలిపారు. ఫెర్రీ మునిగిపోవడానికి ప్రతికూల వాతావరణమే కారణమని భావిస్తున్నారు.

65 మంది ప్రయాణికులు.. 22 వాహనాలు..
ఈ ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారికంగా ధృవీకరించారు. అంతేకాకుండా 22 వాహనాలు, వాటిలో 14 ట్రక్కులు కూడా ఉన్నాయి. కొంతమంది ప్రయాణికులు లైఫ్ బోట్లు ఉపయోగించి తమను తాము కాపాడుకోగలిగారు. ప్రస్తుతం భారీ సంఖ్యలో రక్షణ బృందాలు, నౌకాదళం, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.
ఇక దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో విదేశీ పర్యటనలో ఉన్నా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారని కేబినెట్ కార్యదర్శి తెలిపారు. ఫెర్రీల్లో ప్రయాణికుల సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువగా ఉండడం ఇండోనేషియాలో సాధారణ విషయమని రెస్క్యూ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఎవరైనా విదేశీయులు ఉన్నారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
కాగా ఇండోనేషియాలోని 17,000కి పైగా దీవుల మధ్య ప్రయాణాలు తరచూ పడవల ద్వారానే జరుగుతాయి. అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సముద్ర ప్రయాణాలపై కూడా సరైన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు అమలు చేయకపోతే, భవిష్యత్‌లో మరిన్ని ప్రాణాలు పోయే ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బలి తీరంలో ఇటీవల జరిగిన ప్రమాదాలు..
-
మార్చి 2024లో బాలి తీరంలో 16 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఆ ప్రమాదంలో ఒక ఆస్ట్రేలియా మహిళ మృతి చెందారు.
-
2022లో, 800 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ నిస్సార్ జలాల్లో ఇరుక్కుపోయినప్పటికీ రెండు రోజుల తర్వాత రక్షించబడింది.
-
2018లో, సుమత్రా ద్వీపంలోని టోబా సరస్సులో ఓ పడవ సామర్థ్యానికి మించి 200 మందితో ప్రయాణించడంతో మునిగిపోయి, 150 మందికిపైగా మరణించారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications