పాక్‌కు ముచ్చెమటలు పట్టించిన మహిళ వీరమరణం..(వీడియో)..!!

బలూచిస్తాన్‌లో నెత్తుటి యుద్ధం ముదురుతోంది. పాక్ సైన్యానికి, బలూచ్ తిరుగుబాటుదారులకు (BLA) మధ్య జరుగుతున్న ఈ భీకర పోరులో గత 40 గంటలుగా తుపాకుల మోత ఆగడం లేదు. అటు పాక్ ప్రభుత్వం, ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. ఇద్దరూ భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పరస్పర ప్రకటనలు చేసుకుంటున్నారు.

పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రాంతం బలూచిస్తాన్‌లో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఆదివారం (ఫిబ్రవరి 1) నాటికి ఈ భీకర పోరు ప్రారంభమై 40 గంటలు గడిచింది. ఈ పోరులో ఇప్పటివరకు 145 మంది తిరుగుబాటుదారులను మట్టుబెట్టినట్లు బలూచిస్తాన్ ముఖ్యమంత్రి ప్రకటించగా, పాక్ సైన్యానికి తాము కోలుకోలేని దెబ్బ తీశామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) స్పష్టం చేసింది.

Balochistan

ఆపరేషన్ 'హెరోఫ్' ఫేజ్-2: వణికిపోతున్న పాక్ సైన్యం

బలూచ్ తిరుగుబాటుదారులు 'ఆపరేషన్ హెరోఫ్ ఫేజ్-2' పేరుతో పాక్ సైనిక స్థావరాలపై విరుచుకుపడుతున్నారు. ఖారన్, మస్తుంగ్, దల్బందిన్, టంప్, పస్నీ వంటి ప్రాంతాల్లో తమ లక్ష్యాలను పూర్తి చేసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లామని BLA ప్రకటించింది. క్వెట్టా, నోష్కీ వంటి కీలక నగరాల్లో పాక్ సైన్యం తోకముడిచి వెనక్కి వెళ్లేలా చేశామని వారు పేర్కొంటున్నారు.200 మందికి పైగా పాక్ సైనికులు, పోలీసులు చనిపోయారని, 17 మందిని బందీలుగా పట్టుకున్నామని BLA ప్రతినిధి జియాంద్ బలూచ్ తెలిపారు. తమ వైపు 18 మంది యోధులు మరణించారని వారు అంగీకరించారు.

యుద్ధ క్షేత్రంలో మహిళా ఫిదాయీలు

ఈసారి బలూచ్ పోరాటంలో మహిళా ఆత్మాహుతి దళాలు (Fedayeen) కీలకంగా మారడం చర్చనీయాంశమైంది.2023లో BLAలో చేరిన ఆసిఫా మెంగల్ అనే 24 ఏళ్ల యువతి, జనవరి 31న నోష్కీలోని పాక్ గూఢచారి సంస్థ ISI ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని 'కార్ బాంబు' (VBIED) పేల్చింది. ఈ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.గ్వాదర్ ఫ్రంట్‌లో మరో మహిళా ఫిదాయీ హవా బలూచ్ కూడా పాక్ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందింది.పాకిస్థాన్ ఆర్మీతో పోరాడుతూ వీరమరణం పొందిన ఈ మహిళ సోషల్ మీడియాలో నెటిజెన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.ఫిదాయి హవా బలూచ్ అనే ఆ యువతి పాక్ సైనికులకు చుక్కలు చూపింది.వారిపై తూటాల వర్షం కురిపించింది.ధైర్యంగా ముందుకు కదులుతూ తోటి వారికి ధైర్యాన్ని చెబుతూ స్ఫూర్తిగా నిలిచింది. తమ భయానికి పాక్ సైనికులు ముందుకు రావడానికే వణికిపోతున్నారని చెప్పింది. తమ స్వాతంత్య్రానికి ఈ పోరాటం ఎంతో ముఖ్యమని చెప్పిన 12 గంటలకే ఆమె వీరమరణం పొందింది.

పాక్ ప్రభుత్వం ఏమంటోంది?

తిరుగుబాటుదారులు సామాన్య పౌరుల వేషంలో వచ్చి ఆసుపత్రులు, పాఠశాలలు, బ్యాంకులపై దాడులు చేస్తున్నారని పాక్ మంత్రి తలాల్ చౌదరి ఆరోపించారు. తీవ్రవాదులు ప్రజలను మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. గ్వాదర్‌లో ఒక బలూచ్ కార్మికుడి ఇంట్లోకి చొరబడి ఐదుగురు మహిళలు, ముగ్గురు పిల్లలను చంపేశారని ప్రభుత్వం పేర్కొంది.

పాక్‌కు కొరకరాని కొయ్యగా బలూచిస్తాన్

బలూచిస్తాన్ పాకిస్థాన్‌లో భూభాగం పరంగా అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడ అపారమైన సహజ వనరులు (గ్యాస్, ఖనిజాలు) ఉన్నప్పటికీ, అక్కడి ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. ఇస్లామాబాద్ ప్రభుత్వం తమ వనరులను దోచుకుంటూ, తమకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం లేదని బలూచ్ ప్రజల ప్రధాన ఆవేదన. ముఖ్యంగా చైనా చేపట్టిన CPEC (చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్) ప్రాజెక్టుల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని వారు భావిస్తున్నారు. అందుకే BLA వంటి సంస్థలు పాక్ సైన్యంతో పాటు చైనా ప్రాజెక్టులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

ప్రస్తుతానికి బలూచిస్తాన్‌లో పరిస్థితి నిప్పుల కొలిమిలా ఉంది. పాక్ సైన్యం భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, స్థానిక ప్రజల మద్దతు ఉన్న బలూచ్ యోధులు గెరిల్లా దాడులతో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇది కేవలం తీవ్రవాద సమస్య మాత్రమే కాదు, దశాబ్దాల అణచివేతకు వ్యతిరేకంగా చెలరేగిన తిరుగుబాటుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+