Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్తాన్ లో అమానుషం- నవదంపతులపై కిరాతకం

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఒక దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక యువ జంటను అత్యంత దారుణంగా హత్య చేసిన దృశ్యాలు ఉన్నాయి. ఆ జంట తమ కుటుంబాలను ఎదిరించి వివాహం చేసుకున్నారని సమాచారం. వారిని బానో బీబీ, ఎహసానుల్లాగా గుర్తించారు.

బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా శివారు ప్రాంతంలో గల నిర్జన ప్రదేశానికి కొందరు వ్యక్తులు ఎస్ యూవీ, పికప్ ట్రక్కుల్లో రావడం, ఆ జంటను వాహనాల నుండి బయటకి లాగడం, తలపై శాలువా కప్పుకొని ఉన్న యువతికి ఖురాన్ కాపీని అందించడం ఈ వీడియోలో రికార్డయింది.

Balochistan police have arrested 13 people

ఖురాన్ ను పట్టుకుని ఎదురుగా ఉన్న ఓ గుట్ట వైపు వెళ్తోన్న సమయంలో ఆమె బ్రాహ్వి భాషలో ఓ యువకుడితో మాట్లాడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. నాతో ఏడు అడుగులు నడువు, ఆ తర్వాత వాళ్లు నన్ను కాల్చి చంపవచ్చు అనేది ఆ మాటల సారాంశం. ఆ మాటలు విన్న తరువాత ఆ యువకుడు కొంత దూరం ఆమెతో కలిసి నడవడం ఇందులో చూడొచ్చు.

ఆ కొద్దిసేపటికి ఆ యువతి.. నన్ను కాల్చడానికి మాత్రమే నీకు అనుమతి ఉంది.. తమను తీసుకొచ్చిన వారిని ఉద్దేశించి చెప్పారు. ఆ వెంటనే.. ఆ గుంపులో ఒకరు- ఆమె వీపుపై తుపాకీ గురిపెట్టి కాల్చాడు. బానో బీబీపై ఏడురౌండ్లు, ఎహసాన్ పై తొమ్మిది రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. బుల్లెట్ తగిలిన వెంటనే ఆ యువతి నేలపై కుప్పకూలిపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

మే నెలలో చోటు చేసుకున్న ఘటనగా పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. బక్రీద్ పండగకు మూడు రోజుల ముందు జరిగిందనట్లు తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పాకిస్తాన్‌ సహా ఇతర దేశాల్లో కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఘటనపై వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించాలని, హతురాలి కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్ ఊపందుకుంది. స్థానిక సంప్రదాయాలు, సంస్కృతులను ఉల్లంఘించే మహిళలను లక్ష్యంగా చేసుకుని చేసే నేరాలకు వ్యతిరేకంగా చట్టాలు చేయాలని వారు కోరుతున్నారు.

స్థానిక పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. ఆ జంటను బానో బీబీ, ఎహసానుల్లా గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో 13 మంది అనుమానితులను అరెస్టు చేశారు. కటుంబ పెద్దల అనుమతి లేకుండా బానో బీబీ.. ఎహసానుల్లాను వివాహం చేసుకుందని ఆమె సోదరుడు ఫిర్యాదు చేయడంతో, ఆ జంటను హత్య చేయాలని స్థానిక ముస్లిం మతపెద్దలు నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టయిన 13 మందిలో ఆ ముస్లిం మత పెద్దతో పాటు బానో బీబీ సోదరుడు కూడా ఉన్నారని పోలీసు అధికారి నవీద్ అఖ్తర్ తెలిపారు. ఈ దారుణ ఘటనపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ స్పందించారు. ఈ కేసులో నిందితులపై వీరందరిపై విచారణ జరిపి శిక్షిస్తామని తెలిపారు.

పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం (HRCP) గణాంకాల ప్రకారం, దేశంలో 2024లో కనీసం 405 పరువు హత్యలు జరిగాయి. చాలా కేసులు వెలుగులోకి రాకపోవడంతో వాస్తవ సంఖ్య దీని కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రశ్న: పాకిస్తాన్‌లో ఎన్ని హత్యలు జరిగాయి?

జవాబు: HRCP నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో 2024లో కనీసం 405 పరువు హత్యలు జరిగాయి.

ప్రశ్న: పాకిస్తాన్‌లో వివాహానికి సంబంధించిన చట్టాలు ఏమిటి?

జవాబు: పాకిస్తాన్‌లో ఇతర దేశాల మాదిరిగానే 18 ఏళ్లు పైబడిన అబ్బాయిలు మరియు అమ్మాయిలకు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే చట్టబద్ధమైన హక్కు ఉంది. వారి కుటుంబాలు వ్యతిరేకించినప్పటికీ ఇది వర్తిస్తుంది.

పాకిస్తాన్‌లో కుటుంబ అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే అమ్మాయిలకు ఎలాంటి శిక్షలు ఉంటాయి?

జవాబు: పాకిస్తాన్‌లో కుటుంబ అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే అమ్మాయిలకు ఎలాంటి చట్టపరమైన శిక్షలు ఉండవు. ఇక్కడ కూడా 18 ఏళ్లు పైబడిన అబ్బాయిలు మరియు అమ్మాయిలకు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. అయితే, ఇలాంటి వివాహాలు తరచుగా సామాజిక ఒత్తిడి మరియు కుటుంబ ఆగ్రహానికి గురిచేస్తాయి. కొన్నిసార్లు తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+