బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయంపై బాంబులతో దాడి
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఓ హిందూ దేవాలయం పైన బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో పదిమంది వరకు గాయపడ్డారు. బంగ్లా ఉత్తర ప్రాంతంలోని ప్రాచీన దేవాలయ ప్రాంగణంలో శనివారం నాడు కొంతమంది గుర్తు తెలియని దుండగులు నాటు బాంబులతో దాడికి పాల్పడ్డారు.
హిందూ పండుగ రష్ మేళాను పురస్కరించుకుని దినాజ్‌పూర్‌లో కాంతాజీ దేవాలయం వద్దకు వేలాది భక్తులు వచ్చారు. ఆ సమయంలో దాడి జరిగింది. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ చాందసవాదులు గత కొంతకాలం నుంచి వరుసగా దాడులు చేస్తున్నారు. తాజాగా ఇది మరో దాడి.

రష్ మేళా సందర్భంగా కాంతాజీ ఆలయం వద్ద అయిదువేల మంది వరకు భక్తులు ఓపెన్ ఎయిర్ షోను తిలకిస్తుండగా దుండగులు మూడు నాటు బాంబులతో దాడికి తెగబడ్డారు. గాయపడ్డ వారిలో చాలామందికి బాంబుల్లో అమర్చిన మేకులు, గాజు పెంకులు గుచ్చుకున్నాయి.
ఈ దాడి జరిగిన అనంతరం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ముమ్మర దర్యాప్తు నిర్వహిస్తున్నామని, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ముగ్గురు వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications