బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు-ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాకు బ్రేక్-151 మంది చావులతో..!
బంగ్లాదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో వివిధ కోటాలను అమలు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ఇవాళ పక్కనబెట్టింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ ఎత్తున హింస చెలరేగింది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా నిరుద్యోగులు, యువత రోడ్డెక్కారు. దీంతో చెలరేగిన హింసలో ఏకంగా 150 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ సందర్బంగా హైకోర్టు తీర్పు అక్రమం అని ప్రకటించింది.

బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల పిల్లలకు 30 శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించేందుకు షేక్ హసీనా సర్కార్ ప్రయత్నించింది. దీన్ని హైకోర్టు కూడా సమర్ధించడంతో ఆందోళనలు చెలరేగాయి. వాస్తవానికి 2018లోనే హసీనా సర్కార్ స్వాతంత్ర సమరయోధుల పిల్లలకు 30 శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈసారి హైకోర్టు ఉత్తర్వులతో దీని అమలుకు ప్రయత్నించింది.
గతంలో బంగ్లాదేేశ్ లో స్వాతంత్ర సమరయోధుల పిల్లలకు 5 శాతం, మైనార్టీలు, ట్రాన్సె జెండర్లు, దివ్యాంగులకు కలిపి మరో 2 శాతం మాత్రమే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండేవి. మిగతా 93 శాతం ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగానే భర్తీ చేసేవారు. కానీ 2018లో హసీనా సర్కార్ తమ బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీలో ఉన్న స్వాతంత్ర సమరయోధులకు మేలు చేసేందుకు ఈ కోటాను 30 శాతానికి పెంచింది. దీంతో నిరుద్యోగులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అల్లర్లలో 150 మంది వరకూ చనిపోయారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో విచారణ చేపట్టి ఇవాళ తీర్పు ఇచ్చారు.
బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనల్లో భారీ ఎత్తున జనం మృత్యువాత పడుతుండటంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయినా జనం లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చారు. దీంతో ఇవాళ కూడా హింస కొనసాగింది. ఇందులో దాదాపు 150 మందికి పైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసింది. దీంతో నిరసనలు శాంతించే అవకాశాలున్నాయి. ఇప్పటికే హింసను అదుపు చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధాని షేక్ హసీనా విదేశీ పర్యటన రద్దు చేసుకుని మరీ పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications