బ్యాంకులో చోరీ: లైవ్ టీవీ షోలో బుక్కయ్యాడు
షికాగో: చోరీ చేసిన ఓ వ్యక్తి ఓ టీవీ చానెల్ లైవ్ రిపోర్టు చేస్తుండగా అడ్డంగా బుక్కయ్యాడు. అమెరికాలోని రొచెస్టర్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్టెర్లింగ్ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ లో చోరీ జరిగింది.
కేఐఎంటీ-టీవీకి చెందిన రిపోర్టర్ ఆడమ్ సాలెట్ మంగళవారం లైవ్ రిపోర్టు చెయ్యడానికి ఆ బ్యాంకు దగ్గరకు వెళ్లాడు. బ్యాంకు బయటనిలబడి లైవ్ రిపోర్టు చేస్తున్నాడు. అదే సందర్బంలో బ్యాంకులో నుంచి ఓ వ్యక్తి కంగారుగా బయటకు పరుగుతీశాడు.
ఆ సందర్బంలో టీవీ చానెల్ కెమెరాలో అతను చిక్కాడు. ఆ దృశ్యాలు టీవీ చానెల్ లో లైవ్ లో ప్రసారం అయ్యాయి. ఇప్పుడు పారిపోయిన వ్యక్తి దొంగ అని బ్యాంకు ఉద్యోగులు ఆడమ్ సాలెట్ కు చెప్పారు.

ఇప్పుడు టీవీలో ప్రత్యక్ష ప్రసారం అయిన దృశ్యాలలో ఓ దొంగ ఉన్నాడని, వెంటనే తాను పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమానికి ముగింపు పలికాడు. తరువాత 911కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు ఆడమ్ అలెన్ దగ్గరకు చేరుకుని అతని దగ్గర స్టేట్ మెంట్, వీడియో క్లిప్పింగ్స్ తీసుకుని దొంగ కోసం గాలించారు. ఒక గంటలో దొంగ పోలీసులకు చిక్కిపోయాడు. బ్యాంకులో చోరీ చేసిన వ్యక్తి రియన్ లిస్కో (36) అని పోలీసులు అన్నారు.
ముందు రోజు స్టెర్లింగ్ స్టేట్ బ్యాంకులో చోరీ చేసిన రియన్ లిస్కో మళ్లి చోరీ చెయ్యడానికి వచ్చి కెమెరాకు చిక్కాడని పోలీసులు అన్నారు. రెండు చోరీలు చేసింది తానే అంటూ అతను నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications