మోదీ పర్యటన వేళ.. యూఎస్‌లో హిందూ ఆలయం ధ్వంసం- ఇది వాళ్ల పనే

BAPS Swaminarayan temple: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోన్న వేళ.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటోన్నాయి. గన్ కల్చర్ మళ్లీ పేట్రేగింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం చోటు చేసుకోవడం దీనికి నిదర్శనం.

అదే సమయంలో న్యూయార్క్‌లోని హిందూ ఆలయం విధ్వంసానికి గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయాన్ని ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న కొన్ని బోర్డులను పగులగొట్టారు. మరి కొన్నింటిపై నల్లరంగు పులిమారు. హిందుస్తాన్ ముర్దాబాద్ అనే నినాదాలను ఆలయ ముఖద్వారంపై రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టెర్రరిస్ట్‌గా సంబోధించారు.

BAPS Swaminarayan Temple in New York vandalised

న్యూయార్క్ శివార్లలోని మెల్విల్లే ప్రాంతంలో ఉంటుంది బీఏపీఎస్ స్వామి నారాయణ్ ఆలయం. 2016 అక్టోబర్ 9వ తేదీన ఈ ఆలయం ప్రారంభమైంది. స్వామినారాయణ్ సంస్థాన్ ట్రస్ట్ పరిధిలో ఉంటుంది ఇది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను ఈ ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది.

ఈ నెల 22వ తేదీన ప్రధాని మోదీ న్యూయార్క్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ ఆలయం ఉన్న మెల్విల్లేకు సరిగ్గా 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న నస్సౌ వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో ఏర్పాటు అయ్యే ఓ భారీ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

స్వామి నారాయణ్ ఆలయం ప్రహరీ గోడలు, ముఖద్వారాన్ని ధ్వంసం చేశారు. నల్లరంగు పూశారు. ఆలయ ప్రాంగణం రోడ్లపై పెయింట్‌తో మోదీకి వ్యతిరేక నినాదాలను రాశారు. మోదీని ఉగ్రవాదిగా చిత్రీకరించారు. ఈ దాడి తరువాత కొన్ని చోట్ల ఆలయం పెచ్చులూడి కనిపించింది.

ఈ ఘటనపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దురాగతాన్ని సహించబోమని తెలిపింది. తన అసంతృప్తిని అమెరికా ప్రభుత్వానికి తెలియజేస్తోన్నామని పేర్కొంది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని, ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోన్నామని వివరించింది.

ఈ ఉదంతం పట్ల బీఏపీఎస్ స్వామినారయణ్ సంస్థాన్, హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా తప్పుపట్టాయి. పిరికిపందల చర్యగా అభివర్ణించింది. ధ్వేషానికి పరాకాష్ఠగా పేర్కొన్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తును జరిపించాల్సిన అవసరం ఉందని, నిందితులను అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.

సమాచారం అందిన వెంటనే యూఎస్ సెనెటర్లు నిక్ లాలోటా, టామ్ సుయోజీ, సఫోల్క్ కౌంటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్ రోమైన్, న్యూయార్క్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఫిల్ రామోస్, కీత్ బ్రౌన్, స్టీవ్ స్టెర్న్ ఆలయాన్ని సందర్శించారు. స్వామి నారాయణ్ సంస్థాన్ ప్రతినిధులతో మాట్లాడారు. వారికి భరోసా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+