వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కంటే ఆమే గొప్ప: ఒబామా, చరిత్ర సృష్టించిన హిల్లరీ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో సరికొత్త శకం. హిల్లరీ క్లింటన్ దేశాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి మహిళ హిల్లరీ. రపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో, వీరి మధ్య పోటీ ఉంటుంది.

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షులు బరాక్ ఒమామా మాట్లాడారు. అమెరికాను ముందుకు నడిపించడానికి హిల్లరీ సిద్ధంగా ఉన్నారని, దేశానికి తదుపరి అధ్యక్షురాలు ఆమేనని అన్నారు. ఫిలడెల్ఫియాలో జరుగుతున్న డెమోక్రటిక్‌పార్టీ కన్వెన్షన్‌లో ఒబామా ప్రసగించారు.

ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున బరిలో నిలిచిన హిల్లరీ క్లింటన్‌కు ఒబామా తన పూర్తి మద్దతు ప్రకటించారు. సరిగ్గా 12ఏళ్ల క్రితం తొలిసారిగా ఈ కన్వెన్షన్‌లో ప్రసంగించానని, ఆ సమయంలో కాస్త భయపడినా, నా మీద నాకున్న నమ్మకంతో అంత మంది ప్రజల ముందు తన భావాలను వ్యక్తీకరించగలిగానని చెప్పారు.

Barack Obama slams Trump, makes appeal for Hillary Clinton

మళ్లీ ఇన్నేళ్లకు మీ ముందుకొచ్చానని, అప్పటి కంటే మరింత ఆశావాహ ధృక్పథంతో అమెరికా అధ్యక్షురాలి కోసం ఎదురుచూస్తున్నానని, రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, దేశమంతా తిరిగానని చెప్పారు. ప్రేమకు ఈ దేశంలో హద్దులు లేవన్నారు.

ఆశావాహ ధృక్పథంతోనే అమెరికా ముందుకెళ్తొందన్నారు. ఈ దేశం కోసం ఇప్పటివరకు ఎంతో చేశామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని, ప్రతి అమెరికన్‌ మంచి ఉద్యోగం సాధించేలా ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేయాలన్నారు.

నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలు సాధారణమైనవి కాదని, అమెరికా ప్రగతికి మూలాధారమైన ఎన్నికలన్నారు. గొప్ప నాయకులను ఎన్నుకోడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని, ఇందులో యువత పాత్ర కీలకమన్నారు. నేటి యువతరం కొత్త ఆలోచనలతో ముందుకొస్తోందన్నారు.

అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టాలో వారికి తెలుసునని వ్యాఖ్యానించారు. అధ్యక్ష రేసులో సరైన ప్రణాళికతో ఉన్న ఏకైక వ్యక్తి హిల్లరీనే అన్నారు. క్లిష్ట సయమాల్లో ఎలా స్పందించాలో, సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో ఆమెకు బాగా తెలుసునని, ఆమె కాకుండా అధ్యక్షుడిగా సరైన వ్యక్తి మరెవరూ లేరన్నారు. నేను, బిల్‌ క్లింటన్‌ కూడా ఆమె కంటే అర్హులమైన వ్యక్తులం కాదేమో అన్నారు.

English summary
Barack Obama slams Trump, makes appeal for Hillary Clinton.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X