'కిమ్' మహిమ: ఆ ఒక్క క్రాఫ్‌తో వరల్డ్ పాపులర్, బార్బర్ గ్రేట్ టాలెంట్(వీడియో)

Subscribe to Oneindia Telugu

సెర్బియా: మీడియాలో వివాదాలకు రేటింగ్స్ ఎక్కువ. అందుకే వివాదం ఎక్కడుంటే మీడియా ఫోకస్ అక్కడుంటుంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది పబ్లిసిటీ స్టంట్స్ పరంగాను వివాదాలను సృష్టిస్తారు. మరికొంతమంది వివాదాల్లో వ్యక్తులను టార్గెట్ చేసి పబ్లిసిటీ పొందుతుంటారు.

సరే ఇదంతా పక్కనబెడితే.. వివాదాస్పద వైఖరితో ప్రపంచ దేశాలకు శత్రువుగా మారిన 'కిమ్'కు ఇప్పుడు మీడియాలో విపరీతమైన ఫోకస్ ఏర్పడింది. దీంతో కిమ్ పేరు ప్రస్తావిస్తే చాలు అదో హాట్ టాపిక్ అయిపోతోంది. ఓ సెర్బియన్ బార్బర్‌కు ఎంతోమంది బొమ్మల్ని టాటూస్‌గా వేసినా రాని గుర్తింపు.. ఒక్క కిమ్ టాటూ ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడం ఇందుకు నిదర్శనం.

ఎవరీ బార్బర్:

ఎవరీ బార్బర్:

సెర్బియాకు చెందిన మారియో అనే బార్బర్ హెయిర్ స్టైలిస్ట్ గా స్థిరపడ్డాడు. టాటూస్ తరహా క్రాఫ్ చేయడం ఇతని ప్రత్యేకత. కస్టమర్ల తలలపై వారు కోరుకున్న వ్యక్తుల ముఖచిత్రాలను తలపించేలా క్రాఫ్ చేస్తుంటాడు.

  US Envoy Nikki Haley over North Korea కిమ్ జాంగ్ కు యుద్దం ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు
  ఎంతోమంది బొమ్మల్ని వేసినా:

  ఎంతోమంది బొమ్మల్ని వేసినా:

  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎంతోమంది వ్యక్తుల ముఖ చిత్రాలను మారియో తన కస్టమర్ల తలలపై క్రాఫ్ గా తీర్చిదిద్దాడు. ఇలా ఎనిమిదేళ్లుగా అతను నిత్యం ఎవరో ఒకరి ముఖ చిత్రాలను క్రాఫ్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఇన్నేళ్లలో అతనికి దక్కని గుర్తింపు.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ టాటూ క్రాఫ్ చేయడంతో దక్కింది.

  ప్రపంచవ్యాప్తంగా ఫోకస్:

  ప్రపంచవ్యాప్తంగా ఫోకస్:

  'కిమ్' ముఖచిత్రాన్ని తన కస్టమర్ తలపై క్రాఫ్ చేయడంతో మారియో పేరు మారుమోగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికలన్ని అతని ప్రతిభను ప్రశంసిస్తూ కథనాలను ప్రచురితం చేశాయి. అటు సోషల్ మీడియాలోను అతను క్రాఫ్ చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఇన్నాళ్లు ఎవరూ గుర్తించని తనను ఒక్క బొమ్మ ఇంత పాపులర్ చేయడంపై అతను కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

  కిమ్ వివాదాలు కలిసొచ్చాయి:

  వివాదాస్పద వైఖరితో ప్రపంచ దేశాలకు విలన్ లా మారిన కిమ్ పై ప్రపంచ మీడియా అంత ఓ కన్నేసి ఉంచింది. కిమ్ గురించి ఏ చిన్న లీక్ వచ్చినా.. వార్త దొరికినా దాన్నో బ్రేకింగ్ గా మలిచేస్తోంది. ఇలాంటి తరుణంలో.. కిమ్ ముఖ చిత్రాన్ని తలపించేలా మారియో చేసిన క్రాఫ్ మీడియా కంటపడటం అతన్ని పాపులర్ అయ్యేలా చేసింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  This Serbian barber went one step further than a fade on the side. Barber Creates Incredible Hair Tattoo of North Korea Leader, Kim Jong-un

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి