• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ.. బిగ్గెస్ట్ స్క్రీన్‌పై పూల పండగ వీడియో

|
Google Oneindia TeluguNews

పూల పండగ బతుకమ్మ సంరంభం ముగిసింది. తెలంగాణ లోగిళ్లలో పూర్తయ్యింది. కానీ పండగకు విశ్వవ్యాప్తంగా క్రేజీ వచ్చింది. దీంతో గల్ఫ్, దుబాయ్.. ఇతర దేశాల్లో పండగను కాస్త ఆలస్యంగా జరుపుకుంటున్నారు. పూల పండుగ బతుకమ్మ విశ్వ వేదికపై గొప్పతనాన్ని చాటేందుకు సిద్దమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మరోసారి బతుకమ్మ పండుగ ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.

గౌరవం..

గౌరవం..

ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై శనివారం సాయంత్రం 9.40 నిమిషాలకు, రాత్రి 10.40 నిమిషాలకు బతుకమ్మ వీడియో ప్రదర్శన జరుగనుంది. బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మను ప్రదర్శించబోయే స్క్రీన్ ప్రపంచంలోనే అతి పెద్దది. దేశవిదేశాలకు చెందిన లక్ష మంది బుర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై బతుకమ్మను వీక్షించనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.

ఖ్యాతి

ఖ్యాతి

బతుకమ్మ ద్వారా మన సాంస్కృతి, ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దుబాయ్‌లో జరగబోయే ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొననున్నారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరవతారు.

రెండుసార్లు

రెండుసార్లు

2004 జనవరి 6న బుర్జ్ ఖలీఫా నిర్మాణం మొదలైన సంగతి తెలిసిందే. 829.8 మీటర్ల ఎత్తు గల ఈ భవనంలో మొత్తం 163 అంతస్తులు ఉన్నాయి. అత్యంత వేగంతో వెళ్లే 57 అధునాతన సాంకేతికతతో కూడిన లిప్టులను అమర్చారు. రేపు 9.40 PMలకు రాత్రి 10.40కు రెండు సార్లు బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ వీడియో ప్రదర్శించనున్నారు.

9 రోజులు ఇలా..

9 రోజులు ఇలా..

ఎంగిలిపూలతో మొదలై, సద్దులతో బతుకమ్మ ముగుస్తోంది. రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బతుకమ్మ పేరుతో ఉయ్యాల పాటలతో... బతుకమ్మను కొలుస్తారు. ఆరోరోజు అర్రెం నాడు బతుకమ్మ ఆడరు. అలిగిన బతుకమ్మ అని కూడా చెబుతుంటారు. ఏడోరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ తర్వాత.. తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. దీంతో బతుకమ్మ పండగ ముగుస్తోంది. సద్దులు చేసి.. చెరువు వరకు పాటల పాడుతూ వెళ్లి.. నిమజ్జనం చేస్తారు.

Recommended Video

జీహెచ్ఎంసీ ఆవరణలో బతుకమ్మ వేడుకల్లో ఆడిపాడిన మేయర్ విజయలక్ష్మి
 పండగ

పండగ

సద్దుల బతుకమ్మ రోజున తెలంగాణ ఇళ్లు, వాకిళ్లలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. గునుగు, తంగేడు, చామంతి, బంతి, మందార, కనకాంబరం, గులాబీ, పట్టుకుచ్చుల పువ్వులను సేకరిస్తారు. గుత్తులు కట్టి బతుకమ్మ పేరుస్తారు. దారంతో కట్టిన గునుగు పూల గుత్తులను రంగుల్లో అద్ది బతుకమ్మకు అందాలు అద్దుతారు. గుమ్మడి పువ్వు లేదా పసుపుతో గౌరమ్మను పెట్టి మంగళహారతులు, అగరుబత్తులు వెలిగించి కొలుస్తారు. సాయంకాలం బతుకమ్మ ఆటలు ఆడి పాటలు పాడి.. పోయిరావమ్మా బతుకమ్మ అంటూ సాగనంపుతారు.

English summary
bathukamma photo in dubai burj khalifa building. tomorrow night show the video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X