చైనాలో హైఅలర్ట్ - బహిరంగ ప్రదేశాలు క్లోజ్..!!
బీజింగ్: రెండున్నర సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్నీ వణికించిన ప్రాణాంతక కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది చైనా. హ్యూబే ప్రావిన్స్‌లోని వుహాన్ సిటీలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి బారిన పడని దేశమంటూ లేదు. అన్ని దేశాల్లోనూ అడుగు పెట్టిందీ వైరస్. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను తీసింది. కోవిడ్ బారిన తీవ్రంగా పడిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది. 10 కోట్లకు పైగా పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. 11 లక్షల మంది దీని బారిన పడి మరణించారు.

చాపకింద నీరులా..
ఈ జాబితాలో రెండో స్థానంలో భారత్ నిలిచింది. నాలుగున్నర కోట్లకు పైగా పాజిటివ్ కేసులు భారత్‌లో నమోదయ్యాయి. 5,30,591 మంది మృతిచెందారు. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి భారత్ సహా కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత దీని తీవ్రత తగ్గింది. పూర్తిగా నిర్మూలించకపోయినప్పటికీ- అన్ని దేశాల్లోనూ ఈ మహమ్మారి విస్తరించే వేగం అదుపులోకి వచ్చింది. మాస్కులను ధరించాల్సిన అవసరం లేనంతగా దీని తీవ్రత తగ్గిపోయింది.

ఒక్కరోజులో 28 వేలకు పైగా..
ఇప్పుడు మళ్లీ చైనాలో కరోనా వైరస్- చాప కింద నీరులా విస్తరిస్తోన్నట్టే కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 28,127 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అసింప్టోమేటిక్ కేసులు అధికంగా నమోదు కావడం చైనా అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఒక్కరోజులో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు కావడం ఈ ఏడాది ఏప్రిల్ తరువాత ఇదే తొలిసారి. ఆసుపత్రుల్లో మళ్లీ కోవిడ్ వార్డులు వెలిశాయి. కోవిడ్ బాధితులు పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు.

ట్రావెల్ హిస్టరీ లేకుండానే..
కోవిడ్ బారిన పడిన వారికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. 19 మంది మిలియన్ల మంది నివసించే గ్వాంగ్ఝౌ సిటీలో ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్ అమలవుతోంది. చొంగ్‌క్వింగ్ సిటీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇవన్నీలోకల్‌గా విస్తరించినవే. కొత్తగా ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన వారెవరికీ ట్రావెల్ హిస్టరీ లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఝెంగ్‌ఝౌ సిటీలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

పాక్షిక లాక్‌డౌన్..
రాజధాని బీజింగ్‌లో కూడా సెమీ లాక్‌డౌన్‌ను విధించారు అధికారులు. ఒక్కరోజే 1,438 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన కేసుల సంఖ్య 962. ఒక్కసారిగా భారీగా పెరిగాయి. దీనితో అధికారులు అప్రమత్తం అయ్యారు. హైఅలర్ట్‌ను ప్రకటించారు. బీజింగ్ నగరంలోకి ప్రవేశించడంపై కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కోవిడ్ పరీక్షలను అధికారులు తప్పనిసరి చేశారు.

పార్కులు మూసివేత..
మూడు రోజుల పాటు చెల్లుబాటు అయ్యే కోవిడ్ నిర్ధారణ రిపోర్టులను అందజేయాల్సి ఉంటుందని ఆదేశించారు. బీజింగ్‌లో ఉన్న దాదాపు అన్ని పార్కులను మూసివేశారు. అనేక మ్యూజియంలు మూతపడ్డాయి. హ్యాపీ వ్యాలీ అమ్యూజ్‌మెంట్ పార్క్, చాయోంగ్ పార్క్‌ను క్లోజ్ చేశారు. పరిస్థితి మెరుగుపడిన తరువాతే వాటిని తిరిగి తెరుస్తామని స్పష్టం చేశారు. కేసులు పెరిగితే మాత్రం బీజింగ్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications