హిల్లరీకి బ్రేక్స్.. ట్రంప్ కే, జై అంటున్న హిందూసేన
చార్లెస్టన్ (అమెరికా) : అమెరికా అధ్యక్ష పదవి రేసులో హిల్లరీకి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల మధ్య జరుగుతున్న పోటాపోటీ పోరులో హిల్లరీకి, ప్రత్యర్థి బెర్నీ సాండర్స్ కు నడుమ నెలకొన్న ఫైట్ ఆసక్తిని రేపుతోంది. అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంటారన్న అంచనాలతో డెమెక్రటిక్ పార్టీ తరుపున బరిలోకి దిగిన హిల్లరీకి.. తాజా పరిస్థితులు వైట్ హోజ్ ప్రవేశాన్ని కాస్త జటిలం చేసేలాగే కనిపిస్తున్నాయి. దీనంతటికి కారణం.. పశ్చిమ వర్జీనియాలో జరిగిన ప్రైమరీలో సాండర్స్ హిల్లరీని ఓడించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇప్పటివరకు జరిగిన ప్రైమరీల్లో 23 రాష్ట్రాల్లో హిల్లరీ విజయం సాధించగా.. 19 రాష్ట్రాల్లో సాండర్స్ గెలుపొందింది. అయితే సాండర్స్ తాజా గెలుపు అంతగా ప్రభావం చూపించలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ డెమోక్రటిక్ పార్టీ తరుపున నామినేషన్ పొందడానికి హిల్లరీకి 94 శాతం అవకాశాలున్నాయని తెలుస్తోంది. నామినేషన్ పొందడానికి అవసరమైన 2383 డెలిగేట్ల మద్దతుకు హిల్లరీ కేవలం 144 డెలిగేట్ల దూరంలోనే ఉన్నారు. ఇకపోతే ప్రైమరీ సీజన్ అయిపోయేంత వరకు హిల్లరీపై పోరుకు ఫుల్ స్టాప్ పెట్టేది లేదని సాండర్స్ ప్రకటించారు.

ఇకపోతే ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తరుపున అభ్యర్థిగా ఖరారైన ట్రంప్ విజయం గురించి ఇటు ఇండియాలోను పూజలు, యాగాలు నిర్వహించడం గమనార్హం. ట్రంప్ విజయాన్ని కాంక్షిస్తూ హిందూసేన కార్యకర్తలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద హోమం నిర్వహించారు. హోమం సందర్భంగా 'వియ్ లవ్ ట్రంప్.. వియ్ సపోర్ట్ ట్రంప్..' పేరిట బ్యానర్లను ప్రదర్శించారు. కాగా.. ముస్లిం వ్యతిరేకిగా ముద్రపడ్డ ట్రంప్ కి హిందూసేన మద్దతు తెలపడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే.. భారత్ కు వ్యతిరేకంగా తన వైఖరేంటో బయటపెట్టుకున్న ట్రంప్ గెలవాలని హిందూసేన కోరుకోవడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. అమెరికాలో ఉద్యోగాలను కొల్లగొడుతున్న భారతీయులను వాళ్ల దేశానికి వెళ్లగొట్టాల్సిందేనని ట్రంప్ ఇదివరకు చాలాసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications