Bhagat Singh: భగత్ సింగ్ పేరు చూట్టూ వివాదం.. పాకిస్థాన్‌లో పొలిటికల్ హీట్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ
Pakistan News: స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్ పేరు పొరుగు దేశం పాకిస్థాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ రిటైర్డ్ మిలటరీ అధికారి ఆయనను దారుణంగా అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలు గతంలో కలకలం రేపాయి. ఇది కాస్తా కోర్టు వరకు వెళ్లింది. దీంతో ఎటూ తేల్చుకోలేక పాక్ ప్రభుత్వ మల్లగుల్లాలు పడుతోంది. కాగా ఈ వ్యవహారంపై వచ్చే ఏడాది మొదట్లో విచారణ జరగనుంది.
లాహోరులోని శాద్‌మన్ చౌక్‌కు భగత్ సింగ్ పేరు పెట్టాలని స్థానిక ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదించింంది. దీనికితోడు ఆ కూడలిలో సింగ్ విగ్రహం ప్రతిష్ఠించాలని భావించింది. అయితే ఓ రిటైర్డ్ మిలటరీ అధికారి ప్రతిఘటనతో ప్రతిపాదన రద్దయింది. అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఈ నిర్ణయాన్ని లాహోర్ హై కోర్టుకు తెలియజేశారు. ఇదికాస్తా అప్పట్లో పాకిస్థాన్‌లో న్యాయ, రాజకీయ వివాదాలు మరింత రెట్టింపయ్యేందుకు కారణమైంది.

భగత్ సింగ్ పేరిట శాద్‌మన్ చౌక్‌కు నామకరణం చేయాలని లాహోర్ నగర పాలక సంస్థ ప్రతిపాదించింది. రిటైర్డ్ కమోడోర్ టారిక్ మజీద్ కూడా గవర్నమెంట్‌కు సలహా ఇచ్చే కమిటీలో భాగంగా ఉన్నారు. ఆయన ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భగత్ సింగ్‌ను విప్లవకారునిగా కాకుండా ఓ నేరస్థుడిగా అభిప్రాయపడ్డారు. బ్రిటీష్ పోలీస్ అధికారిని హతమార్చడంతో 1931లో ఉరితీయబడ్డారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజీయంగా హీట్ పెంచాయి.
అక్కడితో ఆగకుండా భగత్ సింగ్ సిద్ధాంతాన్ని మజీద్ విమర్శించారు. శాద్‌మన్ చౌక్‌కు ఆయన పేరు పెట్టడం, అక్కడ ప్రతిమను ప్రతిష్ఠించకూడదంటూ రిపోర్టు ఇచ్చారు. ఈ తరహా చర్యలు ఇస్లామ్‌కు వ్యతిరేకమన్నారు. ఇస్లామిక్ ఐడియాలజీ మరియు పాకిస్థాన్ సంస్కృతికి భగత్ సింగ్ ఫౌండేషన్ వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఆరోపించారు. ఆ సంస్థను దేశం నుంచి బహిష్కరించాలని కోరారు.
మజీద్ వ్యాఖ్యలపై భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ ఛైర్మన్ రషీద్ కురేషి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. భగత్ సింగ్‌తో పాటు తమ సంస్థపై ఆయన చేసిన కఠిన ఆరోపణలకుగాను లీగల్ నోటీసులు పంపించారు. సింగ్ పై ఆయన అభిప్రాయాలు సరికాదంటూ లాహోర్ హై కోర్టులో ఖురేషి పిటిషన్ ఫైల్ చేశారు. కాగా శాద్‌మన్ చౌక్ నామకరణంపై ఇప్పటికీ న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది.












Click it and Unblock the Notifications