టీం జో బిడెన్: వైట్‌హౌస్‌లోకి క్యాంపెయిన్ మేనేజర్.. డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవీ...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం సాధించడంలో జెన్ ఓ మాల్లీ డిల్లాన్ కీ రోల్ పోషించారు. ఓటర్లకు అనుగుణంగా వ్యుహాలు రచించి.. అమలు చేశారు. ఇందులో సక్సెస్ అయ్యారు. అయితే ఆమెకు కీలకమైన పదవీ కట్టబెడతారనే ప్రచారం జరుగుతోంది. పరిపాలనలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవీ అప్పగిస్తారని సీఎన్ఎన్ మీడియా వర్గాల ద్వారా తెలిసింది. వైట్ హౌస్ నియామకాలకు సంబంధించి ఈ న్యూస్ తాజాదని ఎన్‌బీసీ న్యూస్ పేర్కొన్నది.
గత మార్చిలో బిడెన్ టీమ్‌లో జెన్ చేరారు. క్యాంపెయిన్ మేనేజర్‌గా సమర్థవంతంగా పనిచేశారు. బిడెన్‌కు ప్రచారంలో రాజకీయ శత్రువుల నుంచి మాటలయుద్ధానికి తిప్పికొట్టడంలో జెన్ వ్యుహాలు పనికొచ్చాయి. అయితే గతవారం మాత్రం చీఫ్ ఆఫ్ స్టాప్ పోస్టులో రాన్ క్లెయిన్ పేరు వినిపించింది. ఆమెను చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంపిక చేశారు. క్లెయిన్‌కు డిప్యూటీగా జెన్ వ్యవహరించనున్నారు.

అంతకుముందు సాధారణ జాబ్ చేసే జెన్.. తర్వాత క్యాంపెయిన్ విభాగంలో అడుగిడారు. తర్వాత దానిపై కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ బిడెన్ ప్రచారంలో మాత్రం దూకుడు ప్రదర్శించారు. ఇప్పుడు వైట్ హౌస్‌లో కీలక పదవీ దక్కించుకోబోతున్నారు. డెమోక్రటిక్ నేషనల్ కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డెమోక్రటిక్ కన్సల్టింగ్ ప్రెసిషన్ స్ట్రాటజీస్ వద్ద కూడా ఆమె ఇదివరకు పనిచేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications