అమెరికా-రష్యా దోస్తీ: జెనీవాలో Biden-Putin చారిత్రక చర్చలు -ఉత్కంఠ -chinaతో పోరుకు కలిసొచ్చేనా?

అగ్రరాజ్యాల మధ్య శాంతి చర్చలకు స్విట్జర్లాండ్ లోని జెనీవా వేదికైంది. జెనీవా సదస్సు లేదా జెనీవా కన్వెన్షన్ గా పిలుస్తోన్న ఈ ఘట్టంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఫేస్ టు ఫేస్ భేటీ అయ్యారు. రెండు దేశాల సంబంధాలపై సుదీర్ఘంగా ఐదు గంటలపాటు వీరు లోతుగా చర్చలు జరుపుతున్నారు. పలు అంతర్జాతీయ అంశాలతోపాటు చైనాను కట్టడి చేసే అంశాలూ చర్చకు వచ్చినట్లు సమాచారం.

రష్యా అధినేత హోదాలో పుతిన్ ఇప్పటికి ఆరుగురు అమెరికా అధ్యక్షులతో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడయ్యాక జో బైడెన్‌ తొలిసారిగా పుతిన్‌తో సమావేశమయ్యారు. అమెరికా, రష్యా దేశాల మధ్య సంబంధాలు దిగజారాయని వస్తోన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాధినేతలు భేటీ కావడం, కరోనా పరిస్థితులు, చైనా కట్టడి అంశాల నేపథ్యంలో ఈ చర్చలపై ఉత్కంఠ నెలకొంది.

Biden-Putin Historic talks talks in Geneva: First meeting concludes, expanded meeting next

జెనీవా సదస్సులో భాగంగా స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు గయ్‌ పర్మెలిన్‌ ఇరు దేశాల అధ్యక్షులను ఆహ్వానించారు. 18వ శతాబ్దం నాటి ప్రఖ్యాత విల్లా ముందు నిలబడి బైడెన్‌, పుతిన్ లు షేక్ హ్యాండ్ చేస్తూ మీడియాకు పోజులిచ్చిన అనంతరం లోనికెళ్లి చర్చలు జరిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు.. తొలి దశలో ప్రస్తావనకు వచ్చిన ప్రాథమిక అంశాలపై ఇరు దేశాలూ ఓ అంగీకారానికి వచ్చాయి. దీంతో కొద్ది నిమిషాల గ్యాప్ ఇచ్చి, వెంటనే రెండో దశలో లోతైన చర్చలకు దిగారు..

Biden-Putin Historic talks talks in Geneva: First meeting concludes, expanded meeting next

బైడెన్ తోపాటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, ఎన్ఎస్ఏ జేక్ సులివాన్, రష్యాలో అమెరికా రాయబారి జాన్ సులివాన్ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. రష్యా తరఫున పుతిన్ తోపాటు విదేశాంగ మంత్రి సర్గే లావ్రోవ్, విదేశీ వ్యవవహారాల్లో పుతిన్ సలహాదారు యూరి ఉషాకోవ్ తదితరులు పాలుపంచుకున్నారు.

రెండు రోజుల క్రితం బ్రసెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, చైనా ముప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో చైనా, రష్యా అనుసరిస్తున్న వైఖరిని బైడెన్‌ తీవ్రంగా తప్పుపట్టారు. కరోనా విలయం తర్వాత ప్రపంచ రాజకీయ ముఖచిత్రలో మార్పులను అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోన్న అమెరికా.. చైనాపై పోరులో తనతో కలిసొచ్చేలా రష్యాను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అసాధ్యమైన ఆ పనిని బైడెన్ ఎంత వరకు సాధిస్తారో చూడాలి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+