వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిబెట్‌లో వింత: నింగిలో ఉండాల్సిన మేఘాలు నేలను ముద్దాడిన వేళ...(వీడియో)

|
Google Oneindia TeluguNews

టిబెట్ : ఆకాశం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మబ్బులు. కొన్ని సార్లు ఆ మేఘాలు అలా తేలియాడుతూ ఉంటాయి. మరికొన్ని సార్లు దట్టంగా ఆకాశాన్ని కమ్మేస్తాయి. ఒక్కోసారి అసలు ఆకాశంలో మబ్బులే కనిపించవు. ఆసమయంలో ఎర్రటి ఎండ తన ప్రతాపం చూపుతుంది. మొత్తానికి మబ్బులు లేని ఆకాశాన్ని ఊహించలేము. అవి ఎప్పుడూ నింగిని అలా ముద్దాడుతూ కనిపిస్తుంటేనే అందం. కానీ టిబెట్‌లో మబ్బులు మాత్రం నింగిని వదిలేసి నేలను ముద్దాడాయి. ఇదేంటి మేఘాలు నేలపైకి రావడం ఏంటి అనుకుంటున్నారా..? అవును మీరు చదివింది నిజమే... అది టిబెట్టే... అవి మేఘాలే... అది నేలనే....

Big clouds land on Earth in Tibet..Video goes viral

భూమిపై అత్యంత ఎత్తయిన ప్రాంత్రం టిబెట్. టిబెట్‌ను ప్రపంచ దేశాలకు పైకప్పు అని కూడా అంటారు. టిబెట్ ఓ సుందరమైన ప్రదేశం. ఎన్నో ఎత్తైన పర్వతాలు, మంచు కొండలు అక్కడ ఉన్నాయి. భూమికి 16వేల అడుగుల ఎత్తులో టిబెట్ ఉంది. అయితే అక్కడి మేఘాలు ఆ దేశంలోని పర్వతాలను ముద్దాడుతూ వెళ్లడం అక్కడ చాలా కామన్. ప్రతీసారీ పర్వతాలను ముద్దాడటం ఆ మేఘాలకు బోర్ కొట్టాయో ఏమో తెలియదుగానీ... ఈ సారికి మాత్రం ఏకంగా భూమిపైకే వచ్చి భూమిని హత్తుకున్నాయి. ఇది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టిబెట్ అయ్యింది. రహదారులపై ల్యాండ్ అయ్యాయి. ఇది చూసిన చాలామంది అదో కొత్త అనుభూతి పొందారు. వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది.

అయితే ఇలా మేఘాలు భూమిపైకి రావడాన్ని ఏమంటారో కచ్చితంగా తెలియదుగానీ... భూమిపై ఒక్క మేఘం కాదు... కొన్ని పెద్దపెద్ద మేఘాలు వచ్చి భూమిపై సేదతీరాయి. అయితే ఇది పొగ అనుకుంటే పొరపాటే... దుమ్ము కూడా కాదు... ఎందుకంటే అవి స్థిరంగా ఒక్క చోటే ల్యాండ్ అయి ఉన్నాయి. ఇది చూసిన నెటిజెన్లు వావ్ అంటున్నారు. అంతేకాదు ప్రకృతి ప్రసాదించిన ఈ సుందరమైన దృశ్యాన్ని మిస్ అయినందుకు మరికొందరు బాధను వ్యక్తం చేశారు. టిబెట్‌ది భౌగోళిక స్వరూపం కొంచెం చిత్రంగా ఉంటుంది. మంచు పర్వతాలు, మలుపులతో కూడిన హైవేలు ఉన్నాయి. వందేళ్ల క్రితం నాటి హిమనీనదాలు, టిబెట్‌లో కనిపిస్తాయి. పర్వతాలను మేఘాలు తాకడం అక్కడ సర్వసాధారణం. కానీ భూమిపై మేఘాలు వచ్చి వాలడం చాలా విచిత్రంగా ఉంది.

English summary
Known as the 'Roof of the World', Tibet has several towering peaks and snowy landscapes to its name. At an elevation of 16,000 feet (4,900 m) it has the highest region on the Earth. So at many times, the clouds cover the peaks and that is not a rare sight. But to see big clouds landing themselves on road like a well-kept object is definitely rare to see. A video has come up on the internet which is reportedly from Tibet, shows large clouds sitting on a road. It is quite rare to see and most definitely attractive to see.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X