బిలియనీర్ కు బిగ్ షాక్.. దేశ బహిష్కరణ శిక్ష.. ఆ కేసులోనే !
భారతీయ వ్యాపారవేత్త, బిలియనీర్ బల్వీందర్ సింగ్ సాహ్నీకి బిగ్ షాక్ తగిలింది. భారీ స్థాయిలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు రుజువైన నేపథ్యంలో దుబాయ్ క్రిమినల్ కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతే కాకుండా భారీ జరిమానా, కోట్ల రూపాయల విలువైన ఆస్తుల జప్తు, శిక్షా కాలం అనంతరం యూఏఈ నుంచి బహిష్కరణకు కోర్టు ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
"అబు సబాహ్"గా పేరు గాంచిన రాజ్ సాహ్నీ..
బల్వీందర్ సింగ్ సాహ్నీ 'రాజ్ సాహ్ని గ్రూప్ (RSG)' పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని యూఏఈతో పాటు అమెరికా, భారత్ వంటి దేశాల్లో విస్తరించారు. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఫైవ్ స్టార్ హోటళ్లతో పాటు, లగ్జరీ అపార్టుమెంట్లు, వాణిజ్య భవనాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు విలాసవంతమైన కార్లపై ప్రత్యేక మక్కువ ఉంది. 2016లో తన రోల్స్ రాయిస్ కారుకు ప్రత్యేక నంబర్ ప్లేట్ "D5" కోసం ఏకంగా 33 మిలియన్ దిర్హమ్‌లు (సుమారు రూ. 75 కోట్లు) వెచ్చించడంతో హాట్ టాపిక్ అయ్యారు.

రూ.340 కోట్ల అక్రమ లావాదేవీలు..
సాహ్నీపై 2024లో కేసు నమోదైంది. షెల్ కంపెనీలు, ఫోర్జరీ చేసిన ఇన్‌వాయిసుల సాయంతో సుమారు 150 మిలియన్ దిర్హమ్‌లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 340 కోట్లు) అక్రమంగా దేశం బయటకు తరలించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన దుబాయ్ ఫోర్త్ క్రిమినల్ కోర్టు సాహ్నీని, ఇతర నిందితులను దోషులుగా ప్రకటించింది. సాహ్నీకి ఐదేళ్ల జైలు శిక్ష, 5 లక్షల దిర్హమ్‌లు (సుమారు రూ. 1.14 కోట్లు) జరిమానా విధించింది. అంతేకాకుండా అక్రమ లావాదేవీల ద్వారా సంపాదించిన 150 మిలియన్ దిర్హమ్‌ల ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో సాహ్నీ పెద్ద కుమారుడు కూడా శిక్ష పడినట్టు సమాచారం.
ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో పలు కేసుల ఇష్యూలో మన దేశం నుంచి కూడా పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ సహా పలువురు బడా బాబులకు కూడా శిక్ష పడాలని వ్యాఖ్యానిస్తున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications