కంపెనీ సొమ్ము రాసలీలలకు వేశ్యలకు ఖర్చు
జపాన్: ఇటివల కాలంలో కుప్పకూలిన ప్రసిద్ధి చెందిన బిట్ కాయిన్ ఎక్సైంజ్-మౌంట్ గాక్స్ కంపెనీ సీఈవో కార్పెలస్ మరో బండారం బయటపడింది. ఆన్ లైన్ వినియోగదారుల నుంచి సేకరించి దొంగలించిన సొమ్మును ఆయన రాసలీల కోసం వేశ్యలకు ఖర్చు చేశాడని వెలుగు చూసింది.
బిట్ కాయిన్ కంపెనీ వర్చువల్ కరెన్సీ పేరిట వినియోగదారుల నుంచి రూ. వందల కోట్లు వసూలు చేసింది. ఇటివల కాలంలో బిట్ కాయిన్ సంస్థ దివాళా తీసినట్లు ప్రకటించింది. అయితే ఆన్ లైన్ ద్వార వసూలు చేసిన నగదు కంపెనీ ఖాతాల నుంచి మాయం అయ్యిందని వెలుగు చూసింది.
ఈ స్కాంలో కంపెనీ సీఈవో కార్పెలస్ హస్తం ఉందని వెలుగు చూసింది. ఈ విషయంలో జపాన్ పోలీసులు సీఈవో కార్పెలస్ ను ఇప్పటికే అరెస్టు చేశారు. కార్పెలస్ మీద దర్యాప్తు చేసిన పోలీసులు పలు ఆసక్తికరమైన విషయాలను బయటకు లాగారు.

వినియోగదారుల నుంచి సేకరించిన 1.66 లక్షల డాలర్లు తన ఖాతాలలోకి మళ్లించిన కార్పెలస్ ఆ నగదును వేశ్యలకు ఖర్చు చేశాడని వెలుగు చూసింది. అదే విధంగా శృంగార సేవలు లభించే కార్యక్రమాల్లో పాల్గొని ఆ డబ్బును విచ్చల విడిగా మహిళల మీద ఖర్చు చేశాడని విచారణలో బయటపడింది.
2011-2013 మధ్య కాలంలో కార్పెలస్ తన సోంత కంపెనీలకు వినియోగదారుల నగదు మళ్లించాడని వెలుగు చూసింది. ఈ కేసులో మొదటి సారి అరెస్టు అయిన కార్పెలస్ మీద పలు ఆరోపణలు వచ్చాయి. మొత్తం కూపీలాగితే వేశ్యల విషయం వెలుగు చూసిందని, మళ్లి ఆయనను అరెస్టు చెయ్యవలసి వచ్చిందని జపాన్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications