సైన్యానికి ఊహించని దెబ్బ.. 13 మంది కోస్ట్ గార్డ్ సిబ్బంది హతం! (వీడియో)
బలూచిస్తాన్‌లోని కీలకమైన గ్వాదర్ జిల్లాలో పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌ను లక్ష్యంగా చేసుకుని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అత్యంత పక్కా ప్లాన్‌తో ఓ భారీ దాడికి పాల్పడింది. గ్వాదర్ తీరప్రాంతమైన జివానీ సమీపంలో జరిగిన ఈ దాడిలో 13 మంది పాకిస్తానీ కోస్ట్ గార్డ్ సిబ్బంది అక్కడికక్కడే మరణించినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బలూచ్ లిబరేషన్ ఆర్మీ మద్దతు ఉన్న హక్కల్ మీడియా సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసింది.
ఈ దాడికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ కొత్తగా ఏర్పాటు చేసిన సముద్ర పోరాట విభాగం 'హమ్మల్ మారిటైమ్ డిఫెన్స్ ఫోర్స్' పూర్తి బాధ్యత వహించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జియాండ్ బలోచ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సముద్రంలో గస్తీ కాస్తున్న పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు పెద్ద పడవలపై 'హమ్మల్ మారిటైమ్ డిఫెన్స్ ఫోర్స్' బృందం ఏకకాలంలో దాడులు చేసింది. సముద్ర మార్గంలో తమ దళాలను ముందుగానే సిద్ధం చేసి, రెండు ఓడలను ఒకేసారి లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపింది. అయితే ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం గానీ, సైన్యం గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.

ఈ ఏడాదే ఏర్పాటైన సముద్ర విభాగం
బలూచ్ స్వాతంత్య్ర ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు.. అలాగే బలూచిస్తాన్ సముద్ర తీరప్రాంతం, సహజ వనరులను కాపాడుకోవడానికి 2026 ఏప్రిల్ 13న 'హమ్మల్ మారిటైమ్ డిఫెన్స్ ఫోర్స్' రూపుదిద్దుకుంది. 16వ శతాబ్ధంలో ఈ ప్రాంతంలో పోర్చుగీస్ వలస పాలనకు వ్యతిరేకంగా సముద్ర పోరాటం చేసిన ప్రముఖ బలూచ్ వీరుడు 'హమ్మల్ జియాండ్ బలోచ్' జ్ఞాపకార్థం ఈ విభాగానికి ఈ పేరు పెట్టారు. పాకిస్తాన్ సైనిక దళాల సముద్ర కార్యకలాపాలను అడ్డుకోవడమే దీని ముఖ్య లక్ష్యం.
రెండో సముద్ర దాడి
ఈ విభాగం ఏర్పడిన మరుసటి రోజే జివానీలోని మిల్ టియాబ్ ప్రాంతంలో పాకిస్తానీ నావికాదళ గస్తీ పడవపై మొదటిసారిగా దాడి చేసింది. ఆనాటి దాడిలో ముగ్గురు నావికాదళ సిబ్బంది మరణించినట్లు ప్రకటించిన 'హమ్మల్ మారిటైమ్ డిఫెన్స్ ఫోర్స్'.. తాజాగా 13 మంది కోస్ట్ గార్డ్ సిబ్బందిని హతమార్చి పాక్ దళాలకు మరో పెద్ద షాకిచ్చింది.
BLA Releases Video of Claimed Jiwani Maritime AttackThe BLA has published footage purportedly showing its maritime unit targeting Pakistan Coast Guards boats near Jiwani. The group's earlier casualty claims remain unverified.More details in the link below.https://t.co/ZA2nv11sAWTelegram: https://t.co/Tg6I6cICna#BLA #Gwadar #Jiwani
— War Monitor (@warmonitorpakaf) October 11, 2026














Click it and Unblock the Notifications
